Presidential Election 2022: మోదీ, అమిత్ షాతో ద్రౌపది ముర్ము భేటీ- ప్రధాని ఆసక్తికర ట్వీట్
Presidential Election 2022: ఎన్‌డీఏ తరఫున రాష్ట్రపతి బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
Presidential Election 2022: నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్(ఎన్‌డీఏ) తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురువారం దిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెతో భేటీ తర్వాత ప్రధాని.. ముర్ము గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.
Met Smt. Droupadi Murmu Ji. Her Presidential nomination has been appreciated across India by all sections of society. Her understanding of grassroots problems and vision for India’s development is outstanding. pic.twitter.com/4WB2LO6pu9
— Narendra Modi (@narendramodi) June 23, 2022
అమిత్ షాతో
NDA के राष्ट्रपति पद की प्रत्याशी श्रीमती द्रौपदी मुर्मू जी से भेंट कर उन्हें बधाई व शुभकामनाएं दीं।
— Amit Shah (@AmitShah) June 23, 2022
उनके नाम की घोषणा से ही जनजातीय समाज अत्यंत गौरव की अनुभूति कर रहा है।
मुझे विश्वास है कि उनके प्रशासनिक व सार्वजनिक अनुभव का लाभ पूरे देश को मिलेगा। pic.twitter.com/In4ddFZMoL
ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ద్రౌపది ముర్ము కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను అమిత్ షా స్వాగతించారు. భాజపా సీనియర్ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారని సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు. జూన్ 24న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also Read: Uttar Pradesh News: పుసుక్కని అలా కాల్చేశావ్ ఏంటి భయ్యా! బరాత్‌లో ఫ్రెండ్ మృతి!
Also Read: Viral video: ఇదేం సెక్యూరిటీరా బాబు! ఇలా అయితే పిల్ల ఏనుగు కేంటి? PM కైనా ఏం కాదు!