Maoist Chief Keshav Rao Funeral : మావోయిస్టు చీఫ్ కేశవరావు అంత్యక్రియలపై గందరగోళం- పూర్తి చేసినట్టు వీడియోలు వైరల్- తప్పుడు సమాచారం అంటున్న బంధువులు
Maoist Chief Keshav Rao Funeral : మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు చీఫ్ కేశవరావు సహా 8 మంది మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి అయినట్టు ప్రచారం జరుగుతోంది.

Maoist Chief Keshav Rao Funeral : ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం మాడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల అంత్యక్రియలను పోలీసులు నిర్వహించారనే వార్త సంచలనంగా మారింది. బంధవులకు సమాచారం ఇవ్వకుండానే ప్రక్రియ పూర్తి చేశారనే వార్త వైరల్ అవుతోంది. దీని అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. అంత్యక్రియల వార్తలను బంధువులు కూడా ఖండిస్తున్నారు. మృతదేహాలను అప్పగించాలని బంధువులు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అవి విచారణ దశలో ఉన్న టైంలో వస్తున్న వార్తలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
మావోయిస్టు చీఫ్ కేశవరావు సహా ఎనిమిది మంది మావోయిస్టుల అంత్యక్రియలను పోలీసులే పూర్తి చేశారని సాయంత్రం నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రక్రియ పూర్తి చేశారని అంటున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయి వారి మృతదేహాలు అప్పగించాలని ఆయా వ్యక్తుల కుటుంబాలు రిక్వస్ట్ చేసినా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని ఆ వార్తల సారాంశం. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో మృతదేహాలు ఉంచిన పోలీసులు ఇవాళ (సోమవారం ) ప్రక్రియను పూర్తి చేశారనే ప్రసారం జోరుగా సాగుతోంది.
దీన్ని బంధవులు, ఈ పిటిషన్లు వాదిస్తున్న లాయర్లు ఖండిస్తున్నారు. ఇలా చేస్తే పోలీసులు ఇరుక్కుంటారని వారికి బాగా ఆ విషయం తెలుసని అంటున్నారు. అందుకే ఆలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. దీనిపై క్లారిటీ తెలుసుకునేందుకు మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు లాయర్లు తెలిపారు. ముఖ్యంగా నంబాల కేశవరావు మృతదేహంలో కోసం ఆయన కుటుంబ సభ్యులు నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.





















