అన్వేషించండి

Maoist Party Chief: ఈ ముగ్గురిలో ఒకరేనా తదుపరి మావోయిస్ట్ చీఫ్ ! ఈ సమయంలో బాధ్యతలు మోసేదెవరో..

నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్ట్ పార్టీ రధ సారధిఎవరు అన్న చర్చ సాగుతోంది. అయితే ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సోను, దేవ్ జీ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. తదుపరి చీఫ్ తెలుగు వారే అవచ్చు.

Maoist Party News | మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు   పోలీస్ ఎన్ కౌంటర్లో మరణించడంతో ఇప్పుడు తదుపరి చీఫ్ ఎవరు అన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  అందులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల  లక్ష్మణ రావు అలియాస్ గణపతి,  ఆ తర్వాత  ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీక మిషన్ చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్,  వీరిద్దరితో పాటు  పార్టీ సైద్ధాంతిక బాధ్యతలు చూస్తోన్న  మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ దేవ్ జి  పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 రెడ్ కారిడార్ ఏర్పాటు చేసిన ముప్పాళ్ల  లక్ష్మణ రావు అలియాస్  గణపతి

 ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి  ప్రస్తుత జగిత్యాల జిల్లా సారంగ పూర్ మండలం బీర్ పూర్ లో 1945లో జన్మించారు.  ముప్పాళ్ల గోపాల్, శేషమ్మ దంపతులకు జన్మించిన ఆయన  సైన్స్  పట్టా పొది బీఏడీ పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో టీచర్ గా  పని చేశారు. ఆ తర్వాత ఆయన పీపుల్స్ వార్  పార్టీలో చేరారు. ఆ పార్టీలో దాదాపు 15 ఏళ్ల పాటు  కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు. 2004లో పీపుల్స్ వార్, మావోయిస్ట్  కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమయి సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది.  నాటి నుండి 2018 వరకు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా  నాయకత్వం వహించారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో  మావోయిస్టు పార్టీని బలోపేతం చేసి రెడ్ కారిడార్ ఏర్పాటు చేశారు.  పార్టీ సిద్ధాంతాల పట్ల అత్యంత విధేయత,  అద్భుత వ్యూహకర్త, పార్టీకి నిధుల సేకరణలోను విజవంతమైన నాయకుడిగా మావోయిస్ట్ పార్టీ   అతన్ని గుర్తించింది.  

భారత దేశంలో అత్యంత మోస్ట్ వాంటెడ్  లిస్ట్ లో  ఉన్న వ్యక్తి గణపతి.  ఇప్పటి దాకా పోలీసులు ఆయన ఆచూకి కనపెట్టిలేని రీతిలో  అండర్ గ్రౌండ్ లో గడుపుతున్న వ్యక్తి. 2018  నవంబర్ లో ఆయన అర్థరైటిస్, ఉబ్బసం, మధుమేహం  ఇతర వ్యాధుల కారణంగా , మరో వైపు వయో భారం వల్ల పార్టీ  నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుని ప్రస్తుతం చత్తీస్ ఘఢ్ఎన్ కౌంటర్లో మరణించిన  నంబాల కేశవరావుకు  నాయకత్వం అప్పజెప్పారు.  పార్టీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ గణపతి బాధ్యతలు ఎత్తుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు చేస్తుండటంతో ఆ పార్టీ రక్షణకు ఆయన  వ్యూాహాలు, అనుభవం పనికి వస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే వయో భారం కారణంగా మరో సారి  ఆ బాధ్యతలు నిర్వర్తించలేరన్న ప్రచారం మరో వైపు వినబడుతుంది. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ బాధ్యతల్లో ఆయన ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి.


తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సైనిక నిపుణుడు దాడుల వ్యూహకర్త.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వినిపిస్తున్న మరో పేరు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి. ఇతను మావోయిస్ట్ పార్టీలో అత్యంత నిపుణుడైన సైనిక నేతగా, గెరిల్లా దాడుల వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.   ఇతను కూడా గణపతి పుట్టిన ప్రాంతమైన జగిత్యాల జిల్లాకు చెందిన వాడే. పీపుల్స్ వార్ గ్రూప్  నడుస్తోన్న 1990లోనే ఉద్యమ పార్టీలో చేరారు తిరుపతి.  పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకమని మవోయిస్టు చరిత్ర చెబుతోంది.  పీఎల్ జీఏ తొలి ప్లాటూన్ ఏర్పాటులో తిరుపతి అలియాస్ దేవ్ జి  కీలక పాత్ర పోషించారు.  2007లో జరిగిన దంతేవాజ గిదం పోలీస్ స్టేషన్ దాడికి నాయకత్వం వహించింది దేవ్ జీనే. ఈ దాడితో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత 2013లో చత్తీస్ ఘడ్ సుకామా జిల్లా దర్బాలోయలో  జరిగిన దాడి దేశ చరిత్రలోనే అత్యంత విషాదంగా చెప్పుకున్న దాడి. ఈ దాడిలో 32 మంది కిపైగా చనిపోయారు.

చత్తీస్ ఘడ్ మాజీ హోం మంత్రి, సల్వాజుడం వ్యవస్థాపకుడు అయిన మహేంద్రకర్మ, నాటి  చత్తీస్ ఘడ్ పీసీసీ చీఫ్  నందకూమర్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ  కేంద్ర మంత్రి వీసీ శుక్లా  కూడా చనిపోయారు.  ఈ దాడిని దేవ్ జీ, మల్లోజుల వేణుగోపాల్ రావు  కలిసి ప్లాన్ చేసి అమలు చేసినట్లు  పోలీసులు చెబుతారు.  ఇలా దాడలకు ప్లాన్ చేయడంలోను, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో నిపుణిడిగా తిరుపతి అలియాస్ దేవ్ జీకి పేరు ఉంది.  గతంలో నంబాల కేశవరావు పని చేసిన మావోయిస్ట్ పార్టీ  సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు చీఫ్ గా ప్రస్తుం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి  పని చేస్తున్నారు.  నంబాల కేశవరావు మృతితో పాార్టీ చీఫ్ గా  సైనిక నైపుణ్యం , దళిత సామాజిక వర్గం నుండి ఎదిగిన నేతగా దేవ్ జీకే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  ఒక వేళ దేవ్ జీ చీఫ్ గా పార్టీ ఎన్నుకుంటే  అతని సారధ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా స్పందించే దిశగా నడిపిస్తారని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు.

మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక నాయకుడు మల్లోజుల వేణు గోపాల్ అలియాస్ సోను

 మావోయిస్టు పార్టీలో సీనియర్ గా మల్లోజుల వేణు గోపాల్ అలియాస్ సోను ఉన్నారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలోను, పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. ఆజాద్ మరణం తర్వాత కేంద్ర కమిటి అధికార ప్రతినిధి బాధ్యతలను మల్లోజుల వేణు గోపాల్ నిర్వర్తిస్తున్నారు. ఈయన తెలంగాణ లోని పెద్ద పల్లి జిల్లా లో జన్మించారు,  వెంకటయ్య, మధురమ్మకు ముగ్గురు కుమారులు, అందులో వేణు గోపాల్ చిన్న వాడు.   పెద్ద పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ఆ తర్వాత  ఐటీఐ లో రేడియో, టీవీ మెకానిజం కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ తర్వాత పై చదువులు చదివి ఎంటెక్ లో చేరారు. ఆస మయంలోనే ఉద్యమంలో చేరారు. ఉద్యమ నేతలు కొండపల్లి సీతారామయ్య,  కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  పార్టీ పిలుపు మేరకు  వేణు గోపాల్ అటవీ బాట పట్టారు.   మహారాష్ట్ర గడ్చిరోలి దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి నాయకత్వం వహించారు.  పశ్చిమ కనుమల్లోని కేరళ నుండి గోవా వరకు పార్టీ విస్తరణలో వేణు గోపాల్ కీలక పాత్ర పోషించారు.  2010లో ఆజాద్ మరణం తర్వాత కేంద్ర కమిటీ అధికార బాధ్యతలు నిర్వర్తించారు. టెక్నాలిజీ వినియోగించే విషయంలో పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా మల్లోజుల వేణుగోపాల్ కు పేరు. శాటిలైట్ ఫోన్ల వినియోగించే దిశగా పార్టీని తీసుకెళ్లారు.

2010లో దంతెవాడ లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి లో 70 మంది చనిపోయారు. దీని సూత్రదారుల్లో వేణు గోపాల్  ఒకరని పోలీసులు  అనుమానిస్తున్నారు.  2013లో చత్తీస్ ఘడ్ సుక్మ దాడిలో కాంగ్రెస్ నేతల పై దాడి లో దేవ్ జీతో పాటు మల్లోజుల వేణు గోపాల్ ప్రధాన సూత్రదారుడిగా పేరుంది. పార్టీ మిలిటరీ వ్యూహాలు, దాడుల్లో పాల్గొనడమే కాకుండా ఆయనకు పార్టీ సిద్ధాంతల పట్ల అత్యంత పట్టు కలిగిన వ్యక్తిగా పేరుంది. 69 ఏళ్ల వేణు గోపాల్  తదుపరి మావోయిస్ట్ చీఫ్ గా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ సిద్ధాంతాల పట్ల పట్టు, సీనియారిటీ వంటి అంశాలు కలిసి వస్తుందన్న విశ్లేషణ ఉంది. అయితే వయోభారం, అనారోగ్య సమస్యలు, మతి మరుపు వంటి సమస్యలు ఆటంకం కావచ్చు అన్న చర్చ సాగుతోంది.

 అయితే ఈ ముగ్గురిలో ఎవరు మావోయిస్ట్ పార్టీ చీఫ్ అయినా.. వారు తెలుగు వారు అందునా  ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే  కావడం విశేషం.

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget