అన్వేషించండి

Narendra Modi Caste: నరేంద్ర మోదీ క్యాస్ట్ ఏంటీ? రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత?

Narendra Modi Caste : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుల ప్రస్తావన మరోసారి వచ్చింది. ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఇంతకీ మోదీ క్యాస్ట్ ఏంటీ?ఎప్పుడు బీసీల్లో చేర్చారు?

Cast Of Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. గతంలలో ఇదే అంశంపై రాహుల్ గాంధీ విమర్శలు చేసి కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి కామెంట్స్ చేశారు. నరేంద్ర మోదీ బీసీ కాదని అన్నారు. ఆయన కన్వర్టెడ్‌ బీసీగా అభివర్ణించారు. తన పలుకుబడిని ఉపయోగించి కావాలనే తన క్యాస్ట్‌ను బీసీల్లో చేర్పించారని కూడా విమర్శలు చేశారు. 

మోదీపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌లో వాస్తమెంత? ఇంతకీ మోదీ కులమేంటీ? 2000 సంవత్సరంలో ఏం జరిగింది? అసలు విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ తెలి కులానికి చెందిన వ్యక్తి. ఆ కులంలో చాలా ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకటైన మోధ్‌-ఘాంచి కులానికి చెందినవారు. ఎడిబుల్ ఆయిల్‌ సహా ఇతర వాణిజ్య వ్యాపారాలు చేసే వాళ్లు. ఓబీసీ జాబితాలో 23వ ఎంట్రీలో "ఘాంచి (ముస్లిం), తేలి, మోధ్ ఘాంచి, తేలి-సాహు, తేలి-రాథోడ్, తేలి-రాథోర్”" కులాలను చేరారు.  

ఇందులో ముస్లిం ఘాంచి కులాన్ని 1999లోనే BC జాబితాలో చేర్చారు. 2000 ఏప్రిల్ 4న "తేలి", "మోధ్ ఘాంచి", "తేలి సాహు", "తేలి రాథోడ్" "తెలి రాథోర్‌" కులాలను BCల జాబితాలో చేర్చారు. తేలి కులస్థులు గుజరాత్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నారు. కొందరు పేరు వెనుకాల గుప్తా అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు మోదీ అని తగిలించుకుంటారు. బిహార్‌లో ఉన్న తేలి కులస్థులను 53వ ఎంట్రీగా ఓబీసీలో చేర్చారు. రాజస్థాన్‌లో ఉన్న తేలి కులస్థులను ఎంట్రీ 51గా ఓబీసీల్లో చేర్చారు. 

ఏదైనా రాష్ట్రంలో ఒక కులాన్ని OBCలో చేర్చినంత మాత్రాన ఆ కులం కేంద్రంలో ఉన్న ఓబీసీ జాబితాలో ఉండాలని ఏం లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా కులాలను రాష్ట్రంలో ఉన్న బీసీల్లో చేరుస్తారు. తర్వాత కేంద్రం కూడా అధ్యయం చేసి ఓబీసీల్లో చేరుస్తారు. ఇలా కేంద్ర ఓబీసీ జాబితాలో ఓ కులాన్ని చేర్చిన తర్వాత దేశవ్యాప్తంగా చెల్లుబాటు కాదు. కేవలం కేంద్రం పరిధిలో ఉన్న విభాగాల్లోనే ఓబీసీగా చెల్లుబాటు అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ జాబీతాలో చోటు ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో ఓసీగా ఉన్న కులాలు, మరికొన్ని రాష్ట్రాల్లో OBCగా గుర్తింపు పొందే సందర్భాలు ఉన్నాయి.

Also Read: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం

పాటిదార్, బ్రాహ్మణ, వాణిక, ఖత్రి వంటి కులాల మాదిరిగా ఘంచి కులాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యాపార వర్గంగా పరిగణిస్తారు. అయితే, సామాజిక స్థితిగతులపరంగా తేలి కులాన్ని వెనుకబడిన వర్గంగా గుర్తించి గుజరాత్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో BC జాబితాలో చేర్చింది. అప్పటి వరకు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోదీ గుజరాత్‌ సీఎం అయిన తర్వాత అంటే 2002 తర్వాత ఘాంచి/తేలి కులం గురించి ఆరా తీయడం ఎక్కువైంది.  అందుకే కొన్ని చోట్ల ఈ ఘాంచి కులాన్ని 2000లో బీసీల్లో చేర్చారని మరికొన్ని చోట్ల 2002 అని ప్రస్తావిస్తున్నారు. కానీ అధికారికంగా చూస్తే 2000లోనే ప్రక్రియ పూర్తి అయింది.  

మోదీ పేరుపై అనేక వాదనలు 
దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల జాబితాలో ఎక్కడా మోదీ అనే పేరుతో కులం లేదు. ఇది నిర్ధిష్ట సమాజాన్ని లేదా కులాన్ని మాత్రం సూచించదు. మోడీ ఇంటిపేరును హిందువులే కాకుండా ముస్లింలు, పార్సీలు కూడా యూజ్ చేస్తారు. ఇతర కులాల్లో ఉన్న వారు కూడా మోదీ పేరు పెట్టుకుంటారు. గతేడాది ఈ మోదీ పేరుపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దుమారం తెలిసిందే. కేసుల్లో ఇరుక్కొన్న ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. దీంతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పాయారు. అప్పుడే మోదీ ఇంటి పేరు, ఆయన కులంపై భారీ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా మోదీ కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనపై బీజీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

Also Read: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget