అన్వేషించండి

Supreme Court: తప్పుడు పోస్ట్‌లు పెట్టి సారీ అంటే కుదరదు, సినీ నటుడికి సుప్రీం కోర్టు వార్నింగ్

Supreme Court: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడితే అందుకు ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Supreme Court: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడితే అందుకు ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చేసిన తప్పులను, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను మాఫీ చేయడానికి క్షమాపణలు సరిపోవని వ్యాఖ్యానించింది. నటుడు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌పై కేసులో సుప్రీం కోర్టు ఈ వాఖ్యలు చేసింది. మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై విచారణను రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

2018లో ఎస్వీ శేఖర్‌ ఫేస్‌బుక్‌లో మహిళా జర్నలిస్ట్‌లపై అనుచిత పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై తమిళనాడు వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శేఖర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎస్వీ శేఖర్ తప్పును గ్రహించిన తర్వాత పోస్ట్‌ను తొలగించారని, బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారని వివరించారు. ఆయన దృష్టి మసకబారిందని, వేరొకరి పోస్ట్‌ను అనుకోకుండా, చదవకుండా చేసారని కోర్టుకు వివరించారు.  

పొరపాటు జరిగింది.. క్షమించండి
సోషల్ మీడియాలో ఎస్వీ శేఖర్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని, ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్‌గా మారిందని ఆయన తరపు న్యాయవాది వివరించారు. ఆయన గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారని, ఆయన కుటుంబం మహిళా జర్నలిస్టులను గౌరవిస్తుందన్నారు. తాను పోస్ట్ షేర్ చేసే సమయంలో ఆయన కంటి మందు వేసుకుని ఉన్నారని, ఆ కారణంగా పోస్ట్ చేశారని, పోస్ట్‌లోని విషయాలను చదవలేకపోయారని న్యాయస్థానానికి వివరించారు. 

ఎస్వీ శేఖర్ తరఫున వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విషయం చదవుకుండా పోస్ట్‌ను ఎలా షేర్ చేశారంటూ ప్రశ్నించింది. అతనిపై విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ విషయంపై ధర్మాసనం స్పందిస్తూ.. "సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధతో ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించడం అవసరం లేదు, కానీ ఎవరైనా దానిని ఉపయోగిస్తే, దాని కారణంగా జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి," అని  వ్యాఖ్యానించింది.

2018లో మహిళా జర్నలిస్ట్‌లను కించపరుస్తూ ఎస్వీ శేఖర్ పోస్ట్ చేశారు. అది వివాదానికి కారణమైంది. చెన్నై, కరూర్, తిరునెల్వేలి జిల్లాల కోర్టుల్లో జర్నలిస్టుల సంఘం క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలనే ఎస్వీ శేఖర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారహిత్యం తగదని వ్యాఖ్యానించింది. 

సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఫార్వార్డ్ చేసిన పోస్ట్, సందేశం విల్లు నుంచి ఎక్కుపెట్టి వదిలిన బాణం లాంటిదని వ్యాఖ్యానించింది. పోస్ట్ చేసిన వారి వద్ద ఉండే వరకు, అది అతని నియంత్రణలో ఉంటుందని. అది పంపిన తర్వాత దాని వల్ల కలిగే కలిగే నష్టానికి, సంబంధించిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒకసారి నష్టం జరిగితే, క్షమాపణ కోరినా దాన్ని నుంచి బయటపడటం చాలా కష్టమని అభిప్రాయపడింది. ఎస్వీ శేఖర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. 

దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని శేఖర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీం కోర్టు వారి అభ్యర్థనను తిరష్కరించింది. క్షమాపణలు క్రిమినల్ ప్రొసీజర్స్‌ను ఆపలేవని వ్యాఖ్యానిందింది. ట్రయల్ కోర్టు జడ్జిని సంప్రదించాలని సూచించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Indian Cricketer Dies: వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Advertisement

వీడియోలు

SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Indian Cricketer Dies: వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Prasanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
Embed widget