Parliament Budget Session 2022: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు టాటా- ఆ కీలక బిల్లు గురించి తెలుసా?
మార్చి 14న ప్రారంభమైన పార్లమెంటు రెండో విడత సమావేశాలు నేటితో ముగిశాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. నిర్ణయించిన షెడ్యూల్‌కు ఒకరోజు ముందే సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం సభ ప్రారంభమైన వెంటనే సమావేశాలను ముగిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
పెద్దల సభలో
రాజ్యసభలో మాత్రం చివరి రోజు కూడా విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ వాయిదా ప్రకటనను చదివే సమయంలో కాంగ్రెస్, శివసేన ఎంపీలు నినాదాలు చేశారు. ధరల పెరుగుదలపై చర్చ జరపలేదని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.
జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించారు. తొలి విడత ఫిబ్రవరి 11న ముగిసింది. మొదటి దశ సమావేశాల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మార్చి 14న రెండో విడత కోసం సమావేశమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు క్రిమినల్ పొసీజర్ బిల్లును కేంద్రం ఆమోదించుకుంది.
ఏంటి ఈ బిల్లు?
నేరారోపణ కేసుల్లో దోషులు, ఇతరుల గుర్తింపు, దర్యాప్తు కోసం శాంపిల్స్ సేకరించేందుకు దర్యాప్తు సంస్థలను అనుమతించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రతిపాదించారు. నేరస్థుల గుర్తింపు చట్టం-1920 స్థానంలో తెచ్చిన ఈ బిల్లును ఈనెల 4న లోక్‌సభ, ఇవాళ రాజ్యసభ ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. దర్యాప్తు ప్రక్రియను బలోపేతం చేయటం, నేర నిరూపణరేటు పెంచటం ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
Also Read: Intelligence Report: భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి- ఇవేం పనులురా నాయనా?