By: ABP Desam | Updated at : 10 Mar 2023 09:46 PM (IST)
OYO వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట్లో విషాదం
Oyo founder Ritesh Agarwal's father Ramesh Agarwal death: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం గురుగ్రామ్‌లోని ఓ ఎత్తైన భవనంపై నుంచి పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అగర్వాల్ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో రమేష్ అగర్వాల్ భవనంలోని 20 వ అంతస్తు నుండి పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన చనిపోయారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ ఈస్ట్ డీసీపీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి నోట్ తమకు లభ్యం కాలేదన్నారు.
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహం మార్చి 7న అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది. గీతాన్షా సూద్‌ను రితేష్ వివాహం చేసుకున్నారు. రితేష్ అగర్వాల్ రిసెప్షన్‌కు సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసోయోషి సన్ హాజరయ్యారు. నూతన జంట రితేష్, గీతాన్షాలను మసోయోషి సన్ ఆశీర్వదించారు. కానీ మూడు రోజుల వ్యవధిలో శుభకార్యం జరిగిన ఇంట్లోనే విషాదం జరిగింది. రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయారు.
Ramesh Agarwal (father of Oyo founder Ritesh Agarwal) died after falling off the 20th floor in DLF The Crest, Sector 54, Gurugram. Inquest report u/s 174 CrPC carried out. A team along with SHO sec 53 visited the place of occurrence. Postmortem done & body handed over: Virender… https://t.co/IWfXh2cH1O
— ANI (@ANI) March 10, 2023
జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం.. గురుగ్రామ్ లోని సెక్టార్ 54లోని డీఎల్ఎఫ్ కు చెందిన క్రెస్ట్ సొసైటీలో ఓయో ఫౌండర్ రితేష్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ భవనంలోని 20వ అంతస్తు నుంచి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రమేష్ ను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్రరక్తస్త్రావం కావడంతో ఆయన మరణించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని రితేష్ కుటుంబానికి డాక్టర్లు అప్పగించారు. రమేష్ అగర్వాల్ కింద పడిపోయిన సమయంలో కుమారుడు రితేష్, కోడలు గీతాన్షా ఇంట్లో ఉన్నారు.
గురుగ్రామ్ ఈస్ట్ DCP విజేందర్ విజ్ ఒక ప్రకటనలో రమేష్ అగర్వాల్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 174 CrPC సెక్షన్ కింద వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది బాధాకరమైన ఘటన అన్నారు.
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఏమన్నారంటే.. మా నాన్న మరణం కుటుంబానికి తీరని లోటు. ఇది బాధాకరమైన విషయం. కష్టకాలంలో మా నాన్న ప్రేమ, ఆలోచనలు తమను ముందుకు తీసుకెళ్లాయన్నారు. ఈ కష్ట సమయంలో కొంచెం ప్రైవసీ కావాలని కోరుతున్నామని ఓ ప్రకటనలో కోరారు.
మార్చి 7న ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన ఓయో వ్యవస్థాపకుడు రితేష్ వివాహానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు, అర్హతలు ఇవే!
COVID-19 Mock Drills: రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం, వచ్చే నెల కొవిడ్ మాక్ డ్రిల్ - కొత్త మార్గదర్శకాలు జారీ
SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!
RBI: ఏప్రిల్ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?
ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చి కించపరిచారు, ఆయనపై పరువు నష్టం దావా వేస్తా - రేణుకా చౌదరి
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!