అన్వేషించండి

Operation Sindoor: AI ద్వారా పాకిస్తాన్‌ను ఫూల్స్ చేసిన భారత్, అత్యుత్తమ మోసంగా పేర్కొన్న అమెరికా F16 పైలట్

భారత్ తో జరిగిన వైమానిక దాడుల్లో రాఫెల్ ఫైటర్ జెట్ నడిపిన ఓ పైలట్ పాకిస్తాన్ ను ఫూల్ చేసి, ఫేక్ రాఫెల్ ను కూల్చివేసేలా చేశారన్న ఆసక్తికర విషయాన్ని అమెరికా ఎఫ్16 పైలట్ వెల్లడించారు.

IAF used AI In Operation Sindoor | యుద్ధం గెలవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు. తెలివితేటలు కీలకపాత్ర పోషిస్తాయని మరోసారి రుజువైంది.  పాకిస్తాన్ తో జరిగిన వైమానిక దాడుల్లో భారత వైమానిక దళం (IAF) ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ వాడి శత్రువులను దెబ్బకొట్టింది. మే 2025లో పాకిస్తాన్‌తో నాలుగు రోజుల సైనిక ఆపరేషన్‌లో భారత బలగాలు ఏఐని వినియోగించి ఫాక్ ను ఏ విధంగా ఫూల్స్ చేశాయో అమెరికా ఫైటర్ పైలట్ వెల్లడించారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ F-15E,  F-16 పైలట్ గా సేవలందిస్తున్న ర్యాన్ బోడెన్‌హైమర్, ఆపరేషన్ సిందూర్‌ను ఆధునిక వైమానిక పోరాటంలో సరికొత్త దశగా  అభివర్ణించారని idrw.org నివేదించింది. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ రాఫెల్ గార్డ్  AI సాయంతో డెకాయ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.

AI టెక్నిక్ తో పాక్‌ను దెబ్బకొట్టిన ఐఏఎఫ్ 
‘X-గార్డ్ వ్యవస్థను రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ రూపొందించింది. ఇది 500 వాట్లు, 360 డిగ్రీల జామింగ్ సిగ్నల్‌ను జనరేట్ చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. ఈ పరికరం 30 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 100 మీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌పై విమానం వెనుక వెళుతుంది. దీని ప్రయోజనం ఏంటంటే ఇది అసలైన రాఫెల్ ఫైటర్ జెట్ రాడార్ సిగ్నల్స్ ను, డాప్లర్ ప్రభావాన్ని కాపీ చేస్తుంది. దాంతో శత్రువుల వైమానిక బలగాల అదే నిజమైన రాఫెల్ ఫైటర్ జెట్ అని భావించే అవకాశం ఉంది. అసలైనదా కాదా అని గుర్తించడం కష్టమవుతుంది. రాడార్ కు కనిపించిన ఏఐ జనరేటెడ్ ఫైటర్ జెట్ ఆకారాన్ని చూసి రాఫెల్ అని పాకిస్తాన్ వాయుసేన దాన్ని కూల్చివేసింది’ అని అమెరికా ఫైటర్ పైలట్ ర్యాన్ బోడెన్‌హైమర్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే భారత ఐఏఎఫ్ ఫైటర్ చేసింది అత్యుత్తమ స్పూఫింగ్, చీటింగ్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

IDRW నివేదిక ప్రకారం చైనాలో తయారైన ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు (Air To Air Missiles), J-10C ఫైటర్ జెట్‌లతో యుద్ధం చేసిన పాకిస్తాన్ అసలైన భారత ఫైటర్  జెట్‌లను సరిగ్గా గుర్తించలేకపోయాయి. దాంతో అసలైన ఐఏఎఫ్ జెట్స్ ను పాక్ వాయుసేన టార్గెట్ చేయలేకపోయింది. ఈ డెకాయ్ శత్రు రాడార్‌ను తప్పుదారి పట్టించి క్షిపణి వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తుంది. చైనా PL-15 తరువాత వెర్షన్ అయిన PL-15E క్షిపణికి స్పూఫింగ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం లేదు. భారత X-Guard పాకిస్తాన్ J-10C ఫైటర్ జెట్లపై ఉన్న KLJ-7A AESA రాడార్‌ను మిస్ లీడ్ చేశాయి. దాంతో పాక్ వాడిన చైనా ఫైటర్ జెట్స్ అసలైన రాఫెల్ జెట్‌లను టార్గెట్ చేసి ఢీకొట్టాయని పాక్ భావించి ఉండొచ్చు అని అమెరికా ఫైటర్ పైలట్ తెలిపారు.

డెకాయ్ సిస్టమ్ మళ్లీ వినియోగించవచ్చు. అది  వేగవంతమైనది, నమ్మదగినది అని ప్రూవ్ అయింది. ఎక్స్ గార్డ్  AN/ALQ-50 లేదా ADM-160 MALD వంటి పాత US సిస్టమ్ కంటే వేగంగా పనిచేస్తుంది. కేవలం 2 సెకన్లలోపు ప్రయోగించవచ్చు. భారత ఫైటర్ జెట్లు అయిన రాఫెల్ ను కూల్చివేశామని పాక్ భావించడానికి ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఎక్స్ గార్డ్ డెకాయ్ సిస్టమ్ పై దాడి చేయడమే కారణమని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

వైమానిక యుద్ధంలో కొత్త అధ్యాయం
ఎక్స్ గార్డ్ అనేది "డెకాయ్ వింగ్‌మ్యాన్" లాగా పనిచేస్తుంది, శత్రువుల కాల్పులు అసలైన ఫైటర్ జెట్ నుంచి దృష్టి మరళ్చి ఫేక్ ఫైటర్ జెట్ వైపు ఆకర్షిస్తుంది. ఫైబర్-ఆప్టిక్ లింక్ జామింగ్ పైలట్ ఇలాంటివి చేయవచ్చు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ టెక్నాలజీతో పాక్ ను దెబ్బకొట్టిందని అమెరికా ఫైటర్ పైలట్ ర్యాన్ బోడెన్‌హైమర్ తెలిపారు. భవిష్యత్తులో వైమానిక యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా మోసం చేసి శత్రువులను దెబ్బ తీయడం తేలిక అవుతుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget