Operation Spider's Web: రష్యా గడ్డపై నుంచే రష్యాపై దాడి చేసిన యుక్రెయిన్. యాక్షన్ థ్రిల్లర్‌ను తలిపించే రీతిలో 5 ఎయిర్‌బేస్‌లు ధ్వంసం
Ukrain Attack on Russia: ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. రష్యాపై రష్యా నుంచే యుక్రెయిన్ దాడి చేసింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఆపరేషన్‌ను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బ్రిలియంట్ అన్నారు.

Operation Spider's Web: యుక్రెయిన్- రష్యా యుద్ధంలో అతి పెద్ద వార్ ఆదివారం రాత్రి జరిగింది. రష్యా గడ్డపై నుంచే యుక్రెయిన్ రష్యా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అత్యంత రహస్యంగా రష్యాకు డ్రోన్లను తరలించి అక్కడ నుంచే దాడులు చేశారు. ఏకంగా ఐదు వైమానిక స్థావరాలపై జరిగిన ఈ అటాక్‌తో రష్యాకు మైండ్ బ్లాంక్ అయింది. దీనికి ప్రతీకారంగా రష్యా భారీ దాడులు ప్రారంభించింది. పుతిన్ ఏకంగా 470 డ్రోన్లను యుక్రెయిన్‌పైకి పంపించారు.
ఆపరేషన్ స్పైడర్స్ వెబ్
రష్యా – యుక్రెయిన్ యుద్ధం మొదలైన మూడున్నరేళ్లలో అతిపెద్ద దాడిని యుక్రెయిన్ చేసింది. అత్యంత పకడ్బందీగా.. రహస్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌తో రష్యాను చావు దెబ్బ కొట్టింది. Operation Spider's Web పేరుతో నిర్వహించిన ఈ దాడిని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌స్కీ Volodymyr Zelenskyy బ్రిలియంట్ ఆపరేషన్ అని పొగిడారు. రష్యాలోని ఐదు ఎయిర్‌బేస్‌లను యుక్రెయిన్ టార్గెట్ చేసి విజయవంతంగా అమలు చేసింది.

40 రష్యన్ బాంబర్లు ధ్వంసం
దాదాపు ఏడాదిన్నర పాటు నిర్వహించిన ఈ కోవర్ట్ ఆపరేషన్ లో ఒకేసారి దాడులు మొదలు పెట్టింది యుక్రెయిన్. ఈ దాడిలో దాదాపు 40 రష్యన్ బాంబర్లు ధ్వంసం అయినట్లు అంచనా. రష్యాకు 50వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km), Ivanovo (900 km) ల్లోని లక్ష్యాలను ఒకేసారి చేధించారు. రష్యాకు డ్రోన్లను అత్యంత రహస్యంగా తరలించి అక్కడ నుంచే ట్రక్కుల ద్వారా డ్రోన్లను వివిధ వైమానిక స్థావరాల వద్దకు చేర్చారు. ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తలపించే విధంగా ఉన్న ఈ ఆపరేషన్ పూర్తయ్య సరికే ఏం జరిగిందో కూడా రష్యాకు అర్థం కాలేదు. అత్యంత పకడ్బందీగా యుక్రెయిన్ ఈ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో Tu-95 Tu-22 స్ట్రాటజిక్ బాంబర్లతో పాటు.. A-50 రాడార్ డిటెక్షన్ సెంటర్లు నాశనం అయ్యాయి. డ్రోన్లు రష్యా ఎయిర్ క్రాఫ్ట్‌లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇంటర్‌నెట్ లో కనిపిస్తున్నాయి.

దాడిని ధృవీకరించిన రష్యా
యుక్రెయిన్ దాడిని రష్యా ధృవీకకరించింది. Murmansk, Irkutsk ప్రాంతాల్లో చాలా సమీపం నుంచి FTV డ్రోన్ ల దాడి జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ఈ ఘటనలో కొన్ని విమానాలు కాలిపోయాయని వెంటనే మంటలను అదుపు చేశామని చెప్పింది.
Ukrainian "Pavutyna" (spider net) operation is today's attack launched simultaneously on four russia's strategic aviation airbases has reportedly destroyed 40 (forty) strategic bombers on 4 (four) airbases: Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km),… pic.twitter.com/AYr5g7Xr7L
— Sergej Sumlenny, LL.M (@sumlenny) June 1, 2025
రష్యా ప్రతిదాడి- 472 డ్రోన్లతో ఎటాక్ – 12మంది యుక్రెయిన్ సైనికుల మృతి
యుక్రెయిన్ డ్రోన్ అటాక్‌కు దిమ్మతిరిగిన రష్యా.. తేరుకున్న వెంటనే భారీ దాడి చేపట్టింది. యుక్రెయిన్ భూభాగంలోకి 1000 కిలోమీటర్లు వెళ్లి మరీ వారి సైనిక స్థావరంపై దాడి చేశారు. రష్యా మొత్తం 472 డ్రోన్లను ప్రయోగించినట్లు యుక్రెయిన్ తెలిపింది. వీటితో పాటు.. 7 మిస్సైళ్లను కూడా రష్యా యుక్రెయిన్‌పైకి పంపింది. యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో తమపై ఎటాక్ జరగడం ఇదే మొదటిసారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా యుక్రెయిన్ సైనిక స్థావరంపై చేసిన దాడిలో 12 మంది సైనికులు మృతి చెందారు. 60మందికి పైగా గాయపడ్డారు.
మరోవైపు.. రష్యా -యుక్రెయిన్ సరిహద్దుల్లో రైలు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. శనివారం పశ్చిమ ప్రాంతంలోని బ్రయన్స్క్ లో ప్రయాణికుల రైలుపై వంతెన కూలి పడిపోయింది. ఈ ఘటనలో 7గురు పౌరులు చనిపోగా.. 69మంది గాయపడ్డారు. ఆదివారం మరో ప్రాంతంలో గూడ్స్ ట్రైయిన్ పట్టాలు తిప్పింది. ఇవి రెండూ విద్రోహ చర్యలే అని రష్యా అంటోంది.
రెండో విడత చర్చలు మొదలు
రష్యా -యుక్రెయిన్ మధ్య శాంతి కోసం చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ టుర్కియేలో రెండో విడత శాంతి చర్చలు మొదలు కానున్నాయి. శాంతి చర్చలు సజావుగా జరిగేందుకు వీలుగా కొన్ని రోజుల కిందటే రష్యా- యుక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. కానీ ఈలోగా జెలెన్ స్కీ రష్యాపై భారీ దాడి చేశారు. దీంతో శాంతి చర్చలు ఏ విధంగా ముందుకెళతాయన్న ఆందోళన ఉంది.





















