అన్వేషించండి

Supreme Court: సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే చాలా పాఠశాలలు మూతపడాల్సిందే!

Supreme Court: ఈ ఆదేశాలు ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలా లేదా ప్రైవేటు నిర్వహణలోని పాఠశాలలా అనే తేడా లేకుండా అన్ని పాఠశాలలకు వర్తిస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అన్ని పాఠశాలల్లో బాలికలు, బాలుర కోసం వేర్వేరు టాయిలెట్లు అవసరం.
  • వికలాంగ విద్యార్థులకు అనుకూలమైన, వాషింగ్ సౌకర్యాలున్న టాయిలెట్లు తప్పనిసరి.
  • బాలికలకు ఉచితంగా బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు అందుబాటులో ఉంచాలి.
  • రుతు పరిశుభ్రత రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: పాఠశాలల్లో మహిళా, పురుష విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్లు, వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పాఠశాలలు బాలికలకు టాయిలెట్లు, ఉచిత శానిటరీ ప్యాడ్‌లను అందించడంలో విఫలమైతే ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వ నిర్వహణలో ఉన్న లేదా ప్రైవేట్ నిర్వహణలో ఉన్న పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. 

హెల్దీ పీరియడ్స్‌ జీవించే హక్కులో భాగం: అత్యున్నత న్యాయస్థానం

“హెల్దీ పీరియడ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగం” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.

జస్టిస్ జె బి పార్దివాలా, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం రుతు పరిశుభ్రత రాజ్యాంగబద్ధమైన హక్కు అని నొక్కి చెప్పింది. ఆదేశాలను పాటించని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు రద్దును ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.

తప్పనిసరి బాలబాలికలకు వేర్వేరుగా, వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్లు

అన్ని పాఠశాలలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించగల నీటి కనెక్టివిటీతో కూడిన, బాలబాలికలకు వేర్వేరుగా ఉండే టాయిలెట్‌లను అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించిన అన్ని టాయిలెట్లు ప్రైవసీ ఉండాలని తెలిపింది. వికలాంగ పిల్లల అవసరాలను తీర్చాలని కూడా ఆదేశించింది.

అన్ని పాఠశాల టాయిలెట్లలో వాషింగ్ సౌకర్యాలు కూడా ఉండాలి. సబ్బు, నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.

బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు

లైవ్ లా నివేదిక ప్రకారం, ASDM-694 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఆక్సిజో-బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, UTలను ఆదేశించింది.

ఈ శానిటరీ నాప్కిన్లను బాలికలకు సులభంగా అందుబాటులో ఉంచాలి, ప్రాధాన్యంగా టాయిలెట్ ప్రాంగణంలో వెండింగ్ మెషీన్ల ద్వారా లేదా కనిపించని చోట, పాఠశాలలో నిర్ణీత ప్రదేశంలో ఉంచాలి.

ప్రతి పాఠశాల పీరియడ్స్‌ పరిశుభ్రతకు సంబంధించిన బేసిక్ నీడ్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. పీరియడ్స్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి ప్రత్యేకమైన ప్రాంతంలో లో దుస్తులు, యూనిఫాంలు, డిస్పోజబుల్ ప్యాడ్లు, ఇతర ముఖ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలి.

డిసెంబర్ 10, 2024న జయ ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. 6 నుంచి 12 తరగతుల వరకు ప్రభుత్వ,  ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం 'పాఠశాలకు వెళ్లే బాలికల కోసం  పీరియడ్ హైజీన్‌ విధానాన్ని' దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిటిషనర్  కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget