News
News
X

National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు, ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

National Games 2022: జాతీయ 36వ జాతీయ క్రీడలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ ఈ క్రీడలను ప్రారంభించబోతున్నారు. 

FOLLOW US: 
 
National Games 2022: ఈరోజు నుంచి 36వ జాతీయ క్రీడలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే పోటీలు జరగబోతున్నాయి. భారత్ లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే ఈ క్రీడలు గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభింనున్నారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భావ్ నగర్ ఈ క్రీడలకు వేదికలు కాబోతున్నాయి. సైక్లింగ్ విభాగంలో పోటీలకు మాత్రం దిల్లా ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 36 క్రీడాంశాల్లో 7 వేలకు పైగా అథ్లెట్లు తలపడనున్నారు. 

ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు..

భారత టేబుల్ టెన్నిస్ ఎల్లుండి నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనాల్సి ఉండడంతో టీటీ పోటీలను ఈనె 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి, ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరి సారిగా 2015లో కేరళలో ఈ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్ లో నిలిచింది. ఏపీ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. 

అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే..

News Reels

ఒలపింక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీవీ సింధు, బజ్ రంగ్ పునియా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ వేర్వేరు కారణాల వల్ల ఈ క్రీడలకు దూరం అయ్యారు. కానీ ఆరంభోత్సవంలో నీరజ్, సింధు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టన్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా, బాక్సర్ శివథాపా, అథ్లెటిక్స్ లో ద్యుతి, హిమదాస్, మురళీ శ్రీశంర్ ఈ క్రీడలు ఆకర్షణగా నిలవనున్నారు. 

భారత సంప్రదాయ ఆటలు ఖోఖో, యోగాసన, మల్లఖంబ్ జాతీయ క్రీడల్లో ఆరంగ్రేటం చేస్తున్నాయి. అవిభాజ్య భారత్ లో 1924లో లాహోర్ లో తొలిసారి జాతీయ క్రీడలు నిర్వహించారు. ఆ ఏడాది పారిస్ ఒలంపిక్స్ కు అథ్లెట్లను ఎంపిక చేయడం కోసం ఇండియన్ ఒలంపిక్ క్రీడలు పేరుతో వీటిని మొదలు పెట్టారు. రెండేళ్ల కొకసారి వీటిని నిర్వహించారు. 1940లో జాతీయ క్రీడలుగా పేరు మార్చారు. 1985 నుంచి ఒలంపిక్స్ ఫార్మాట్ లో క్రీడలు నిర్వహించడం మొదలు పెట్టారు. మధ్యలో కొన్ని సందర్భాలను మినహాయిస్తే.. ప్రతి రెండేళ్ల కొకసారి ఈ క్రీడలు జరిగాయి. 2002లో ఈ క్రీడలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది.  

Published at : 29 Sep 2022 12:51 PM (IST) Tags: PM Modi Prime Minister Modi Gujarat Latest News National Games 2022 National Games Started

సంబంధిత కథనాలు

Gujarath Political News : సంబరపడాలా, జాగ్రత్త పడాలా? ఈ తీర్పు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా ?

Gujarath Political News : సంబరపడాలా, జాగ్రత్త పడాలా? ఈ తీర్పు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా ?

Mainpuri Bypoll Result: డింపుల్ యాదవ్‌కు భారీ మెజార్టీ, మెయిన్‌పురి మళ్లీ ఎస్‌పీ కైవసం

Mainpuri Bypoll Result: డింపుల్ యాదవ్‌కు భారీ మెజార్టీ, మెయిన్‌పురి మళ్లీ ఎస్‌పీ కైవసం

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Election Results 2022 Live: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం

Election Results 2022 Live: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం

Himachal Pradesh Election Results 2022: ప్చ్ గెలిచినా ఆనందం లేదు, ఆపరేషన్ లోటస్‌కు బలైపోతున్న కాంగ్రెస్

Himachal Pradesh Election Results 2022: ప్చ్ గెలిచినా ఆనందం లేదు, ఆపరేషన్ లోటస్‌కు బలైపోతున్న కాంగ్రెస్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు