అన్వేషించండి

Nasa On Chandrayan3: చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ ఫొటోను తీసిన నాసా స్పేస్‌క్రాఫ్ట్‌

Nasa On Chandrayan3: చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ ఫొటోను తీసిన నాసా స్పేస్‌క్రాఫ్ట్‌

చంద్రుడిపైకి భారతదేశం సగర్వంగా పంపించిన చంద్రయాన్‌ 3 ల్యాంకర్‌ విక్రమ్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యూనార్‌ రీకన్నైసెన్స్‌ ఆర్బిటార్‌(LRO) స్పేస్‌క్రాఫ్ట్‌ ఫొటో తీసింది. ఆగస్టు 27న తమ ఎల్‌ఆర్‌ఓ విక్రమ్‌ ల్యాండర్‌ను ఫొటో తీసినట్లు నాసా వెల్లడించింది. ఆ ఫొటోను సోషల్‌మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేసింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ను ఎల్‌ఆర్‌ఓ ఇటీవల ఫొటో తీసిందని నాసా పేర్కొంది.

ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ విక్రమ్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై తిరుగుతూ ఎన్నో కీలకమైన అంశాలను తెలియజేసింది. అయితే నాసా ఎల్‌ఆర్‌ఓ విక్రమ్‌ చంద్రుడిపై ల్యాండ్‌ అయిన నాలుగు రోజుల తర్వాత ఫొటోను తీసింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు రోజుల తర్వాత తమ ఎల్‌ఆర్‌ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ 42 డిగ్రీల ఏటవాలు కోణంలో తీసినట్లు పేర్కొంది. నాసాకు చెందిన ఈ ఎల్‌ఆర్‌ఓను మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నాసా గోడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ మేనేజ్‌ చేస్తుంది. వాషింగ్టన్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో సైన్స్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ కోసం ఇది పనిచేస్తుంది. 

ఇస్రో ఇటీవల చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ అద్భుతమైన 3డీ చిత్రాన్ని పంచుకుంది. అనాగ్లిఫ్‌ (Anaglyph) టెక్నిక్‌ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. అనాగ్లిఫ్‌ అనేది స్టీరియో  లేదా మల్టీ-వ్యూ ఇమేజెస్ నుంచి త్రీ డైమెన్షన్స్ లో తీసిన సింపుల్ విజువలైజేషన్ అని ఇస్రో వివరించింది. ‘‘ఇక్కడ చూపిస్తున్న అనాగ్లిఫ్ (ఫోటో) నావ్‌క్యామ్ స్టీరియో ఇమేజెస్ (NavCam Stereo Images) వాడి క్రియేట్ చేశారు. ఇందులో ప్రజ్ఞాన్ రోవర్‌ క్యాప్చర్ చేసిన ఎడమ, కుడి ఇమేజెస్ రెండూ ఉన్నాయి. స్పేస్ ఏజెన్సీ ఈ 3-ఛానల్ ఇమేజ్‌లో ఎడమ ఇమేజ్ ఎరుపు ఛానెల్‌లో ప్లేస్ చేసి ఉందని, కుడి ఫోటో బ్లూ, గ్రీన్ ఛానెల్స్‌ (సియాన్ కలర్ క్రియేట్ చేయడం) లో ప్లేస్ చేసి ఉంది. ఈ రెండు ఫోటోల మధ్య దృక్కోణంలో డిఫరెన్స్ స్టీరియో ఎఫెక్ట్‌కు దారి తీస్తుంది. ఇది త్రీ డైమెన్షన్స్‌ ఇంప్రెషన్ ఇస్తుంది’’ అని ఇస్రో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 3Dలో ఈ ఫోటోని చూడాలంటే త్రీడీ గ్లాసెస్ వాడాలని ఇస్రో సూచించింది. 

ఈ ఫోటో ఆగస్టు 30న తీసినదని ఫోటోలో స్పష్టంగా ఉంది. అంటే ప్రజ్ఞాన్ రోవర్‌ ను స్లీప్ మోడ్‌లోకి పంపడానికి ముందే ఈ ఫోటోని తీశారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget