అన్వేషించండి

Muzaffarpur Hospital Fire: బిహార్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం! పలువురు రోగులు మృతి !

Muzaffarpur Hospital Fire: ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని మొదట్లో అనుమానించారు. ఈ అగ్నిప్రమాదం, పొగ కారణంగా పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముజఫర్‌పూర్ ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
  • షార్ట్ సర్క్యూట్ తో పొగ వ్యాపించి ముగ్గురు రోగులు మరణించారు.
  • పన్నెండు మంది రోగులను తరలించారు, యాజమాన్యం స్పందనపై ప్రశ్నలు.

Muzaffarpur Hospital Fire: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజే, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (జూన్ 4వ తేదీ) తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో, ముజఫర్‌పూర్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన ప్రసాద్ హాస్పిటల్ ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటలో పలువురు రోగులు మృతి చెందారు. ఐసీయూలో 15 పడకలు ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

అగ్నిప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. దీనికే ఎక్కువ మంది రోగులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 15 మందిని సిబ్బంది రక్షించగా, వారిలో ముగ్గురు మరణించినట్లు నిర్ధారించారు. మిగిలిన 12 మంది రోగులను చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేర్చారు. 

నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ముగ్గురు రోగులు మరణించారు. 15 మంది రోగులను ఐసీయూలో చేర్చగా, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం 

ప్రారంభంలో, ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అక్కడున్న వారి సహాయంతో లోపల చిక్కుకున్న రోగులను రక్షించారు. సురక్షితంగా బయటపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అగ్నిమాపక శాఖ అధికారులు ఏం చెప్పారు?

ప్రసాద్ ఆసుపత్రిలోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెల్లవారుజామున 3:55 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. పన్నెండు మందిని రక్షించగా, ముగ్గురు రోగులు మరణించారు. 

ఇంతలో, ఐసియులో రోగుల కోసం 13 పడకలు ఉన్నాయని, అదనంగా మరో రెండు పడకలు ఏర్పాటు చేశారని ఒక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, హార్ట్ మానిటర్లు, ఇతర పరికరాలతో సహా అనేక యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాలలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పొగ వ్యాపించడంతో, రోగుల పరిస్థితి మరింత విషమించింది. సహాయక చర్యలు పూర్తయ్యాయి, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.  

పట్టించుకోని ఆసుపత్రి యాజమాన్యం  

ఘటనా స్థలంలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించిన వారెవరూ కనిపించలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏబీపీ న్యూస్ విలేకరులు ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, యాజమాన్యం నుంచి ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాలేదు. ఈలోగా, అక్కడున్న భద్రతా సిబ్బంది తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు యూనిఫామ్‌లు తీసేసి, జాకెట్లు ధరించి తిరిగారు. 

Frequently Asked Questions

ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రిలో ఏం జరిగింది?

జూన్ 4వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు రోగులు మరణించారు.

ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటి?

ఐసీయూలో ఉన్న యంత్రాలలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పొగ వ్యాపించడం వల్ల చాలా మంది రోగులు మృతి చెందారు.

అగ్నిప్రమాదంలో ఎంతమంది రోగులు మృతి చెందారు?

ప్రమాదంలో ముగ్గురు రోగులు మరణించినట్లు ధృవీకరించబడింది. మొత్తం 15 మంది రోగులను రక్షించగా, మిగిలిన 12 మందిని చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.

అగ్నిప్రమాద సమయంలో ఆసుపత్రి యాజమాన్యం స్పందన ఎలా ఉంది?

ఘటనా స్థలంలో ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన వారెవరూ కనిపించలేదు. వారు మాట్లాడటానికి కూడా ముందుకు రాలేదని నివేదించబడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget