By: ABP Desam | Updated at : 21 Oct 2021 07:47 AM (IST)
కర్ణాటక హైకోర్టు(ఫైల్ ఫొటో)
ముస్లిం వివాహం హిందూ మతంలో జరిగినట్లుగా ధార్మికమైనది కాదు అని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు అని.. ఒకవేళ అది రద్దైనా.. బాధ్యతలు మాత్రం అస్సలు రద్దు కావాని వ్యాఖ్యానించింది.
ఇంతకీ కేసు ఏంటంటే..
బెంగళూరులోని భువనేశ్వరి నగర్‌కు చెందిన ఎజాజుర్ రెహ్మాన్ అనే వ్యక్తి రూ.5000 కట్నం చెల్లించి సైరా బానును వివాహం చేసుకున్నాడు. 1991 నవంబర్ 5న ముమ్మారు తలాక్ చెప్పి సైరా బానుకు విడాకులు ఇచ్చాడు. అనంతరం కొన్ని రోజులకు మరో షాది చేసుకున్నాడు. ఓ బిడ్డకు కూడా తండ్రి అయ్యాడు. అయితే.. 2002 ఆగస్టు 24న సైరా బాను.. తన ఖర్చుల కోసం రెహ్మాన్‌పై కేసు వేసింది.
ఈ కేసులో బెంగళూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సైరా బాను మరో వివాహం చేసుకునే వరకైనా.. ఇద్దరిలో ఒకరు మరణించేంత వరకు రెహ్మాన్.. నెలకు రూ.3000 వేల చొప్పున మహిళకు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. నిర్వహణ ఖర్చులు చెల్లించే విషయంపై.. బెంగళూరు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రెహ్మాన్.. హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఈ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
వివాహం అనేది ఓ కాంట్రాక్టు. దానికి ఎన్నో అర్థాలు ఉంటాయని హైకోర్టు తెలిపింది. హిందూ వివాహంలా.. ముస్లిం వివాహం ధార్మికమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహం రద్దు అయినంత మాత్రాన దాని ద్వారా తలెత్తే బాధ్యతలు, హక్కులు విస్మరణకు గురికావని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందంతోనే ముస్లిం వివాహం ప్రారంభమవుతుందని.. ఈ ఒప్పందమే క్రమంగా సాధారణ వివాహ స్థాయికి చేరుకుంటుందని కోర్టు చెప్పింది. అయితే ఇక్కడే కొన్ని న్యాయపరమైన బాధ్యతలు ఏర్పడతాయని గుర్తు చేసింది. విడాకులు ఇచ్చిన మాజీ భార్యకు సాయం అందించడం కూడా అందులోని ఒకటేనని విషయం గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది.
Also Read: Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..
Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ
Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం
Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్
National Survey: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Rupee Memes : తగ్గిపోతున్న రూపాయి విలువ - సోషల్ మీడియా మీమ్స్ చూస్తే ఆ కోపాన్ని మర్చిపోతారు
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి