News
News
X

Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం

లఖింపుర్ ఖేరీ ఘటన దర్యాప్తును ఆలస్యం చేయడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

FOLLOW US: 
 
సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే స్టేటస్ రిపోర్ట్ ఆలస్యంగా కోర్టుకు సమర్పించడంపై సీజేఐ ఎన్‌వీ రమణ.. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. అయితే ఈ నివేదిక కోసం న్యాయమూర్తులు నిన్న రాత్రి వరకు వేచి ఉన్నట్లు సీజేఐ అన్నారు.

" మీరు 34 మంది సాక్ష్యులను విచారించారు. నలుగురి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. మిగిలినవారివి ఎందుకు చేయలేదు? కేవలం నలుగురి వాంగ్మూలాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి?                                 "
-సుప్రీం ధర్మాసనం

మిగిలిన వారి వాంగ్మూలాలు రికార్డ్ చేయడానికి కాస్త సమయం కావాలని యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే అన్నారు. అయితే కోర్టు ఆయన సమాధానంపై అసహనం వ్యక్తం చేసింది.

News Reels

" దర్యాప్తులు ఎప్పుడూ అంతులేని కథలుగా మిగలకూడదు. సాక్ష్యులను త్వరగా విచారించండి. వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయండి. ఈ కేసులో అభియోగాలు చాలా తీవ్రమైనవి.                                     "
-సుప్రీం ధర్మాసనం

కోర్టుకు వాదనలు వినిపించిన తర్వాత హరీశ్ సాల్వే.. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. కేసును అక్టోబర్ 26కు వాయిదా వేసింది. ఆ విచారణకు ముందే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సాక్ష్యులకు రక్షణ కల్పిస్తామని యూపీ సర్కార్.. కోర్టుకు తెలిపింది.

ఇదీ కేసు..

ఇటీవల యూపీలోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు.  వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. అనంతరం మంత్రి కుమారుడితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Oct 2021 03:09 PM (IST) Tags: supreme court Farmers Protest Ashish Mishra lakhimpur kheri violence lakhimpur kheri violence news lakhimpur kheri violence case yogi government Lakhimpur Kheri Case Hearing Lakhimpur Kheri Case Status Report Ajay Misha Teni

సంబంధిత కథనాలు

పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి ఒకే హోటల్‌ గదిలో ఉండొచ్చా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి ఒకే హోటల్‌ గదిలో ఉండొచ్చా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

MP Vijaya Saireddy: బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు, ఇప్పుడు రూట్ మార్చేశారా !: విజయసాయిరెడ్డి

MP Vijaya Saireddy: బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు, ఇప్పుడు రూట్ మార్చేశారా !: విజయసాయిరెడ్డి

Breaking News Live Telugu Updates: రాష్ట్రపతి ముర్ముకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

Breaking News Live Telugu Updates:  రాష్ట్రపతి ముర్ముకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్