By: ABP Desam | Updated at : 09 May 2022 01:22 PM (IST)
Edited By: Murali Krishna
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై NIA దాడులు
NIA Raids: అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేస్తోంది. దావూద్ లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.
ఏకకాలంలో
NIA detains Salim Fruit following a raid at his residence in Mumbai. He is an associate of Dawood Ibrahim. Some important documents also seized.
Raids at several locations in Mumbai linked to gangster Dawood Ibrahim's associates and a few hawala operators are underway by NIA. pic.twitter.com/v1pdEw1RJw— ANI (@ANI) May 9, 2022
ముంబయిలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్, పాలెల్, శాంతాక్రజ్ సహా మొత్తం 20 ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు.
దావూద్ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వాళ్లు, షార్ప్ షూటర్లు, డ్రగ్ ట్రాఫికర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు.
డీ కంపెనీ
నవాబ్ మాలిక్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని చాలా మంది అనుమానితులను కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. దావూద్ ఇబ్రహీం కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పని చేస్తున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నాయి.
దావూద్‌కు చెందిన డీ కంపెనీలోని అగ్రనాయకత్వం అండతోనే దేశంలో పలు నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. దీంతో దావూద్‌కు చెందిన స్థావరాలు, అనుచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.
1993 నాటి ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన అండర్‌వరల్డ్ డాన్ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. దావూద్‌కు చెందిన డీ కంపెనీని కూడా ఉగ్రవాద సంస్థగా 2003లో అమెరికా ప్రకటించింది. ఇటీవల దేశంలో పలు ఉగ్రదాడులకు దావూద్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది.
Also Read: Viral Video: మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా?- వైరల్ వీడియో
Also Read: Russia's Space Agency Chief: అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తాం: రష్యా సంచలన వ్యాఖ్యలు
Gyanvapi Mosque Case: జ్ఞాన్ వాపి మసీదు కేసులో వాదనలు పూర్తి- తీర్పు రేపటికి రిజర్వ్ చేసిన వారణాసి కోర్టు
Quad Summit 2022: అన్ని దేశాలకు అనుకూలమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం భారతదేశం పని చేస్తుంది: ప్రధాని మోదీ
India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!