Viral Video: మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా?- వైరల్ వీడియో
Viral Video: హరియాణాలో ఓ చిరుత పులి దాడి చేసిన ఘటనలో మొత్తం నలుగురు అధికారులు గాయపడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Viral Video:
హరియాణాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు.
Tough day at work for people from police and forest dept.. A couple of them suffered injuries..Salute to their bravery and courage..In the end, everyone is safe..Including the leopard.. pic.twitter.com/wbP9UqBOsF
— Shashank Kumar Sawan (@shashanksawan) May 8, 2022
ఏం జరిగింది?
బెహరంపూర్ గ్రామంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు పోలీసులు.. అటవీశాఖ అధికారులతో కలిసి గ్రామానికి వచ్చారు. అయితే పోలీసులపై ఆ చిరుత అటాక్ చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చిరుత వేగంగా వారిపై దాడి చేసింది.
కర్రలతో పోలీసులు చిరుతను కొట్టాలని ప్రయత్నించినా అది అందర్నీ హడలెత్తించింది. మొత్తం అయిదారుగు పోలీసులు చుట్టుముట్టినా ఆ చిరుత మాత్రం అందరిపై దూకుతూ దాడి చేసింది. ఇద్దర్ని చిరుత కరిచింది.
మొత్తానికి
చివరకు దానికి మత్తు మందు ఇచ్చి విజయవంతంగా పోలీసులు బంధించారు. అయితే చిరుత దాడిలో ఎస్‌హెచ్‌ఓ తో పాటు ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు గాయపడ్డారు. ఈ వీడియోను పానిపట్ ఎస్పీ శషాంక్ కుమార్ సావన్ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది పోలీసులు సాహసోపేతంగా వ్యవహరించారని స్పందిస్తుంటే. మరికొంతమంది మాత్రం.. ఎలాంటి జాగ్రత్తలు, పరికరాలు తీసుకోకుండా పోలీసులు వెళ్లారని పేర్కొంటున్నారు. ఇలాంటి రెస్క్యూ చర్యల్లో శిక్షణ ఉన్న సిబ్బందిని తీసుకువెళ్లాలంటున్నారు.
1 Without precuation you went there 1st wrong.
— Mishab Bin Hamza E (@MishabHamza) May 8, 2022
2 Unable to see any forest department officers.
3 it exposes the inefficiancy in dealing with such contengeuos situations.
4 Trained officers are handling matters similar to Commons.
5 Lacking proper equipments and safety measures.
Also Read: Russia's Space Agency Chief: అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తాం: రష్యా సంచలన వ్యాఖ్యలు
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు- 29 మంది మృతి