Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్
Arvind Kejriwal's Speech: అరవింద్ కేజ్రీవాల్ స్పీచ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు మోదీ మోదీ అంటూ నినదించారు.
Arvind Kejriwal's Speech:
ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ప్రసంగం..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి ఆప్‌కి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. కాసేపటి వరకూ "మోదీ మోదీ" అంటూ గట్టిగా నినదించారు. దీంతో కేజ్రీవాల్ అసహనానికి గురయ్యారు. అంతలోనే కూల్ అయిపోయి.."దయచేని నేను చెప్పేది 5 నిముషాలు వినండి" అని చేతులు జోడించి వేడుకున్నారు. నినాదాలతో విద్యావ్యవస్థ బాగు పడుతుందనుకుంటే 70 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చేవని అన్నారు. అప్పటికే బీజేపీ, ఆప్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. అటు ఆప్ కార్యకర్తలూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈస్ట్ ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అలజడి రేగింది. ఈ కార్యక్రమానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు బీజేపీ ఎంపీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. ఇటీవలే ఈ క్యాంపస్‌ని నిర్మించారు. మొత్తం 19 ఎకరాల్లో చేపట్టిన ఈ నిర్మాణానికి రూ.388 కోట్లు ఖర్చైంది. 2,400 మంది విద్యార్థులకు సరిపడ వసతులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ప్రసంగిస్తుండా..బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
"రెండు పార్టీల కార్యకర్తలు కాసేపు శాంతించాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఓ 5 నిముషాలు వినండి. అప్పటికి కూడా మీకు నచ్చకపోతే నినదించండి. అప్పటి వరకూ మాత్రం శాంతించండి. నినాదాలతో విద్యావ్యవస్థ మారిపోతుందనుకుంటే..గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చుండేవి"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
#WATCH | Delhi: At the new campus of the Guru Gobind Singh Indraprastha University, CM Arvind Kejriwal says "With folded hands, I request you to please listen to me for 5 minutes", as BJP and AAP supporters indulge in verbal altercation and chant slogans for their respective… pic.twitter.com/USoRIQtAIB
— ANI (@ANI) June 8, 2023
गुरू गोबिन्द सिंह इंद्रप्रस्थ यूनिवर्सिटी का पहला कैम्पस द्वारका में है और दूसरा अब पूर्वी दिल्ली में। आज से पूर्वी दिल्ली के इस शानदार और बेहद आधुनिक कैम्पस की शुरूआत हो चुकी है। सभी दिल्लीवासियों को बहुत-बहुत बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 8, 2023
बच्चों को अच्छी से अच्छी शिक्षा और बेहतरीन सुविधाएँ देने में… pic.twitter.com/VfzxqLmz6P
కేజ్రీవాల్ ఎమోషనల్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను తాను చాలా మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్...ఢిల్లీలోని విద్యావ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే మనీశ్ సిసోడియాను తలుచుకున్నారు. విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించడానికి సిసోడియా చాలా తపన పడ్డారని, ఆయన తన పక్కన లేకపోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్ట్ అయ్యారు.
Also Read: Monsoon 2023: కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు