Manipur Encounter: మణిపూర్‌లో భారీ ఎన్ కౌంటర్, 11 మంది ఉగ్రవాదులు హతం - మిలిటెంట్ల కాల్పుల్ని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్
CRPF News | మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటరలో 11 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
Encounter Jiribam area of Manipur | జిరిబామ్: మణిపూర్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉగ్రమూకల్ని ఏరివేస్తోంది. జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో వెంటనే స్పందించిన బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. దాంతో జిరిబామ్ జిల్లాలో అశాంతి నెలకొల్పాలని చూసిన ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదులతో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం విమానంలో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
అస్సాం సరిహద్దులో మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉగ్ర కదలికలు జరుగుతున్నాయి. కుకీ మిలిటెంట్లు జిరిబామ్ పోలీస్ స్టేషన్ పై రెండు వైపుల నుంచి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపులోని బలగాలు ఉగ్రమూకలపై ఎదురుకాల్పులు జరిపి వారి ఆట కట్టించాయి. పోలీస్ స్టేషన్ పై దాడి అనంతరం సీఆర్పఎఫ్ క్యాంప్ లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. కానీ పీఎస్ పై కాల్పులు మొదలుపెట్టిన వెంటనే , సీఆర్పఎఫ్ సిబ్బంది తక్షణమే ఎదురుకాల్పులు జరపగా 11 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
11 suspected militants killed in an encounter with CRPF in Jiribam area of Manipur. A CRPF personnel is also critically injured in the encounter: Sources pic.twitter.com/mDoJu2VA3y
— ANI (@ANI) November 11, 2024
హింస చెలరేగి 200 మంది వరకు మృతి
గత ఏడాది మే నుంచి మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మెటీస్, కొండల్లో జీవించే కుకీల మధ్య చెలరేగిన హింసలో చెలరేగి 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయులగా మారి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఉగ్రవాదులు బోరోబెక్రా పోలీస్ స్టేషన్ లక్ష్యంగా చేసుకుని పలు రౌండ్లు కాల్పులు జరిపారు. గత వారం కాల్పులు జరపడంతో అప్పటినుంచి జిరిబామ్ లో ఉద్రిక్తత నెలకొంది. గత గురువారం నాడు హమర్ తెగకు చెందిన ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి భర్త ఆరోపించాడు. జిరిబామ్ లో కొన్ని ఇళ్లకు నిప్పు సైతం పెట్టి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.
సీఆర్పీఎఫ్ విశేష సేవలు
దేశంలోని అతిపెద్ద సాయుధ బలగాలలో సీఆర్పీఎఫ్ ఒకటి. జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టులు, నక్సల్స్ వ్యతిరేఖ ఆపరేషన్లలో వారు కీలకంగా వ్యవహరించారు. బిహార్ లోని కైమూర్, రోహ్ టస్ లతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నక్సలిజాన్ని రూపు మాపడంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. కాగా, రెండు అస్సాం రైఫిల్స్ విభాగాలను మణిపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు తరలించడంపై కుకీ తెగలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుకీ తెగలు ఆందోళనకు దిగడం తెలిసిందే.
Also Read: Prajwal Revanna: మహిళలపై లైంగిక దాడి కేసు - సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు