అన్వేషించండి

Bihar Meat Sale: మాంసం అమ్మకాలపై కఠిన ఆంక్షలు! సంచలన నిర్ణయం తీసుకున్న బిహార్ ప్రభుత్వం

Bihar Meat Sale: ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాంసం విక్రయాలు జరగాలని, రూల్స్ పాటించకుంటే మాత్రం సీరియస్‌ యాక్షన్ ఉంటుందని బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా అన్నారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బిహార్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
  • లైసెన్స్ ఉన్న దుకాణదారులు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మకాలు చేయాలి.
  • దుకాణాలను కర్టెన్లు లేదా గాజుతో కప్పి, పరిశుభ్రత పాటించాలని ఆదేశాలు.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Bihar Meat Sale: బిహార్‌లో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాన్ని నిషేధించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని సంకేతాలు ఇచ్చింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా సోమవారం (ఫిబ్రవరి 16) నాడు మాంసం ఇకపై బహిరంగ ప్రదేశాల్లో అమ్మే పరిస్థితి ఉండదని చెప్పేశారు. ఇకపై ఎవరి మనోభావాలు దెబ్బతినవని ప్రకటించారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే విక్రయాలు చేస్తారని, వారు కూడా ప్రభుత్వ రూల్స్‌కు అనుగుణంగానే స్సష్టం చేశారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తన ప్రభుత్వం గొడవలు సృష్టించదని,సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.

లైసెన్స్ ఉన్నవారు మాత్రమే మాంసం అమ్మగలరు - విజయ్ కుమార్ సిన్హా

"బహిరంగంగా మాంసం అమ్మకాలు ఉండవు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే మాంసం అమ్మగలరు. మాంసం అమ్మకందారులు అన్ని నియమాలను పాటించాలి, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బిహార్ అంతటా బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలను ఉండబోవు" అని ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి విజయ్ సిన్హా శాసన మండలిలో అన్నారు. 

మాంసం దుకాణాలను కర్టెన్లు లేదా గ్లాస్‌తో కప్పాలి - విజయ్ సిన్హా

"పరిశుభ్రత, ప్రజారోగ్యం, క్రమశిక్షణను కాపాడుకోవడానికి ఈ నిర్ణయం అవసరం. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. స్థానిక నిఘాను పెంచాలని, రూల్స్‌ను కఠినంగా అమలును నిర్ధారించాలని అధికారులకు సూచించారు. దారిన వెళ్ళేవారికి మాంసం దుకాణాల వల్ల అసౌకర్యం కలగకుండా కర్టెన్లు లేదా గ్లాస్‌లతో కవర్ చేయాలి" అని బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా అన్నారు.

ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధ, గృహనిర్మాణ మంత్రి ఇంకా మాట్లాడుతూ దర్భంగాలో మేధావులు, భూ సంస్కరణల ప్రజా సంక్షేమ కమిటీలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మాంసం దుకాణాలు ఉండటం వల్ల కొన్ని రోడ్లపై ప్రజలు తిరగడం మానేశారు. చట్టాన్ని ఇలా ఉల్లంఘించడం కొనసాగించడానికి అనుమతించబోం. ప్రతిపక్షాలు సభను బహిష్కరించడంపై ఆయన మాట్లాడుతూ, "ప్రతిపక్షానికి నాయకుడు లేడు. యజమాని పోయినప్పుడు, ప్రజలకు ఏం చేయగలరు. ఇది ప్రతిపక్ష దుస్థితి. ప్రతిపక్షానికి నాయకుడు లేకపోవడంతో, వారు తమకు తోచినట్టు చేస్తున్నారు" అని అన్నారు. 

Frequently Asked Questions

బిహార్ లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలను నిషేధించారా?

అవును, బిహార్ ప్రభుత్వం ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలను నిషేధించింది. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే, నియమాలకు లోబడి అమ్మకాలు చేయాలి.

ఈ నిబంధనల ప్రకారం మాంసం దుకాణాలు ఎలా ఉండాలి?

మాంసం దుకాణాలను కర్టెన్లు లేదా గ్లాస్‌తో కవర్ చేయాలి. తద్వారా దారిన వెళ్ళేవారికి అసౌకర్యం కలగదు మరియు పరిశుభ్రత పాటించబడుతుంది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అధికారులకు స్థానిక నిఘాను పెంచి, నియమాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget