అన్వేషించండి

Bihar CM Nitish Kumar Oath 2025: బిహార్‌ ముఖ్యమంత్రిగా పదోసారి నితీష్‌ ప్రమాణం- కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, లోకేష్‌

Bihar CM Oath Ceremony : బిహార్‌లో మరోసారి నితీష్ ప్రభుత్వం కొలువు దీరింది. ప్రమాణ స్వీకారమహోత్సవం వైభవంగా సాగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

Bihar CM Nitish Kumar Oath 2025:  బిహార్‌ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత  జనతాదళ్ (యునైటెడ్) లెజిస్లేచర్ పార్టీ నాయకుడు నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం నితీష్‌ కుమార్‌తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్రబాబు, లోకేష్ సహా  అనేక మంది కేంద్ర మంత్రులు, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  

నవంబర్ 20 గురువారం ఉదయం 11:30 గంటలకు బిహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. చాలా రాజకీయ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన చారిత్రాత్మక ప్రజా మైదానంలో కార్యక్రమం సాగింది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో జనం, అగ్ర నేతలు తరలి వచ్చారు. 

ముందుగా నితీష్‌ కుమార్‌తో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు 26 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రలుగా ప్రమాణం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

  1. సామ్రాట్ చౌదరి(Samrat Choudhary)
  2. విజయ్ సిన్హా(Vijay Kumar Sinha)
  3. విజయ్ కుమార్ చౌదరి(Vijay Kumar Choudhary)
  4. శ్రవణ్ కుమార్(Shravan Kumar)
  5. బిజేంద్ర ప్రసాద్ యాదవ్(Bijendra Prasad Yadav)
  6. మంగళ్ పాండే(Mangal Pandey)
  7. అశోక్ చౌదరి(Ashok Choudhary)
  8. లేసీ సింగ్(Leshi Singh)
  9. మదన్ సహాని(Madan Sahni)
  10. నితిన్ నవీన్(Nitin Navin)
  11. రామ్‌కృపాల్ యాదవ్(Ramkripal Yadav)
  12. సునీల్ కుమార్(Sunil Kumar)
  13. జమా ఖాన్(Mohammad Zama Khan)
  14. దిలీప్ కుమార్ జైస్వాల్(Dr. Dilip Jaiswal)
  15. సంజయ్ సింగ్ టైగర్(Sanjay Singh Tiger)
  16. అరుణ్ శంకర్ ప్రసాద్(Arun Shankar Prasad)
  17. సురేంద్ర మెహతా(Surendra Mehta)
  18. నారాయణ్ ప్రసాద్(Narayan Prasad)
  19. లఖేంద్ర కుమార్(Lakhendra Kumar Roshan)
  20. శ్రేయసి సింగ్(Shreyasi Singh)
  21. డాక్టర్ ప్రమోద్ కుమార్(Dr. Pramod Kumar)
  22. రమా నిషాద్(Rama Nishad)
  23. సంజయ్ కుమార్(Sanjay Kumar)
  24. సంజయ్ కుమార్ సింగ్(Sanjay Kumar Singh)
  25. దీపక్ ప్రకాష్(Deepak Prakash)
  26. సంతోష్ కుమార్ సుమన్(Santosh Kumar Suman)

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొత్త బిహర్ ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచారు. తరువాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే సంకేతాలు ఉన్నాయి.  ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టి మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నారు.

NDAలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన BJP, JD(U)కాకుండా, ప్రతి ఆరుగురు MLAలకు ఒక మంత్రి పదవి అనే సూత్రాన్ని అనుసరించి, ఇతర కూటమి భాగస్వాములకు కూడా మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందూస్థానీ అవామ్ మోర్చాకు ఒక్కొక్క మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మూడు మంత్రిత్వ శాఖలు చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీకు వెళ్ళవచ్చు, మిగిలినవి బిజెపి, జెడి(యు) మధ్య పంచుకుంటారు. 

నవంబర్ 14న వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో 202 సీట్లు గెలుచుకుని NDA అఖండ మెజారిటీని సాధించింది, BJP 89, JD(U) 85, LJP(RV) 19, HAM 5, RLM 4 సీట్లు గెలుచుకున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Advertisement

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
Embed widget