అన్వేషించండి

Mamata Banerjee: ఎమ్మెల్యేగా పోటీకి ఐదు కోట్లు డిమాండ్! 70 మందికిపైగా లీడర్లు ఇచ్చారు! మమతా బెనర్జీపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీకి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. హౌరాలోని శివ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు ఐదు కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
  • టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారని, నిరాకరించడంతోనే టికెట్ దక్కలేదని ఆరోపణ.
  • పార్టీలో అవినీతి, అభివృద్ధి లేకపోవడంతోనే ఓటమి ఎదురైందని తివారీ విశ్లేషణ.
  • మంత్రి పదవి అధికారాలు లేని లాలీపాప్ వంటిదని, క్రికెట్ వైపు వెళ్తానని వెల్లడి.

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మాజీ భారత్ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ తివారీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన తివారీ, తనకు, టీఎంసీకి మధ్య ఉన్న బంధం తెగిపోయిందని టీఎంసీ అధ్యాయం ముగిసింది అని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఆయన బయటపెట్టారు. 

టికెట్ కోసం ఐదు కోట్లు అడిగారు

హౌరాలోని శివ‌పూర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మనోజ్‌ తివారీకి ఈసారి పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీనికి గల కారణాన్ని వివరిస్తూ, ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటే ఐదు కోట్లు చెల్లించాలని పార్టీ వర్గాలు తనను డిమాండ్ చేశాయని ఆయన ఆరోపించారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి తాను నిరాకరించినందునే తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. కేవలం తనకే కాకుండా, ఈ ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు ఐదు కోట్లు చెల్లించి టికెట్లు కొనుకున్నారని తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ మొత్తాలు చెల్లించగల వారికే టికెట్లు దక్కాయని ఆయన విమర్శించారు. 

వైఫల్యాలపై తివారీ విశ్లేషణ

అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ఓటమి పాలైన, బీజేపీ క్లీన్‌ స్వీప్ చేసింది. ఈ ఘోర పరాజయంై తివారీ స్పందిస్తూ, పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోవడం ఏ రంగంలోనూ అభివృద్ధి జరగకపోవడం వల్లే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. టికెట్లు కొనుక్కున్న వారిలో ఎంత మంది గెలిచారో ఒకసారి పరిశీలించాలని ఆయన సవాల్ చేశారు. 

Also Read: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?

మంత్రిపదవి ఒక లాలీపాల్‌

మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడా శాఖ సహాయ మంత్రిగా పని చేసిన తివారీ, తన పదవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి తనకు కేవలం ఒక లాలీపాల్ లాంటిదని, దానికి ఎటువంటి అధికారాలు లేవని ఆయన వాపోయారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కనీసం సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తే సమయం లేదని మమతా బెనర్జీ తనను వారించే వారని గుర్తు చేసుకున్నారు. 

Also Read: రాజీనామా చేసే ప్రశ్నే లేదు - మేము ఓడిపోలేదు - తేల్చేసిన మమతా బెనర్జీ

క్రీడా మంత్రిపై అసహనం 

రాష్ట్ర కేబినెట్ క్రీడా మంత్రి అరూర్‌ బిస్వాస్‌పై కూడా తివారీ తీవ్ర విమర్శలు చేశారు. క్రీడల గురించి ప్రాథమిక అవగాహన లేని వారు మంత్రిగా ఉండటం బాధాకరమన్నారు. క్రీడా మంత్రికి ఉన్న అభద్రతా భావం వల్ల తనను కనీసం వేదికలపైకి ఆహ్వానించే వారు కాదని తివారీ ఆరోపించారు. మెస్సీ కోల్‌కతా పర్యటనకు వచ్చిన సందర్భంగా జరిగిన గందరగోళంపై స్పందిస్తూ అదక విఫల ప్రయోగమని, సామాన్య ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?

రాజకీయాలకు గుడ్‌బై, క్రికెట్‌వైపు అడుగులు 

రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ, తిరిగి క్రికెట్‌వైపు అడుగులు వేస్తున్నారు. బీసీసీఐ లెవల్‌2 కోచింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఆయన బెంగాల్ రంజీ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.  

Also Read: బెంగాల్ పోరులో శక్తి స్వరూపాలు- అరాచకంపై సామాన్యుల సమరభేరి - ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది చరిత్ర!

Frequently Asked Questions

మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారు?

టికెట్ కోసం ఐదు కోట్లు అడిగారని, చెల్లించలేకపోవడంతో టికెట్ నిరాకరించారని మనోజ్ తివారీ ఆరోపించారు. పార్టీలో అంతర్గత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నారు.

టికెట్ల కేటాయింపులో అవినీతి జరిగిందని మనోజ్ తివారీ ఆరోపించారా?

అవును, టికెట్లు కొనుక్కోవడానికి భారీ మొత్తాలు చెల్లించాల్సి వచ్చిందని, 70-72 మంది అభ్యర్థులు ఇలాగే టికెట్లు కొనుక్కున్నారని తివారీ ఆరోపించారు.

మంత్రి పదవిపై మనోజ్ తివారీ ఏమన్నారు?

తన మంత్రి పదవి కేవలం ఒక 'లాలీపాల్' లాంటిదని, ఎటువంటి అధికారాలు లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రీడా మంత్రిపై మనోజ్ తివారీ విమర్శలు చేశారా?

అవును, క్రీడల గురించి అవగాహన లేనివారు మంత్రిగా ఉండటం బాధాకరమని, తనను వేదికలపైకి కూడా ఆహ్వానించేవారు కాదని తీవ్ర విమర్శలు చేశారు.

రాజకీయాల నుండి వైదొలిగిన తర్వాత మనోజ్ తివారీ ఏం చేయనున్నారు?

రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ తిరిగి క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. బెంగాల్ రంజీ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget