అన్వేషించండి
Advertisement
Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం
Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Maharashtra New CM: మహారాష్ట్ర రాజకీయంలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. ఈ మేరకు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
" ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత కేబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు. అయితే ఏక్‌నాథ్ షిండేకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుంది. "
- దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత
భాజపా పెద్ద మనుసు
" నియోజకవర్గ సమస్యపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు వెళ్లాం. కానీ మాకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవిని నేను ఎన్నడూ ఆశించలేదు. కానీ భాజపా పెద్ద మనసుతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. "
- ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత
షిండే ప్రొఫైల్
- మహా వికాశ్ అఘాడీ ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే.. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.
- అనేక ప్రాంతాల్లో శివసేన పార్టీని బలోపేతం చేసిన నేతల్లో ఏక్‌నాథ్ ఒకరు.
- మహారాష్ట్ర అసెంబ్లీకి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు.
- 2004, 2009, 2014, 2019లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
- 2014లో శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
- అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా చేశారు.
- పార్టీలో ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. భారీ ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తుంటారు.
- ఏక్‌నాథ్ కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీ. సోదరుడు ప్రకాశ్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.
Also Read: UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion