అజిత్ పవార్ కొత్త ఆఫీస్‌కి తాళం, కీస్ కనిపించక గందరగోళం - నేతల పడిగాపులు
Maharashtra NCP Crisis: అజిత్ పవార్ కొత్త ఆఫీస్ తాళాలు కనిపించకుండా పోయాయి.
Maharashtra NCP Crisis:
ఆఫీస్ బయటే అంతా..
మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు తరవాత NCPకి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై కన్‌ఫ్యూజన్ మొదలైంది. పార్టీ భవిష్యత్ ఏంటి..? అని అడిగితే "శరద్ పవార్" అని చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చారు శరద్ పవార్. అదే నమ్మకంతో పార్టీని నడిపిస్తారని NCP నేతలు చెబుతున్నారు. అయితే..అటు అజిత్ పవార్ గ్రూప్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ వర్గంలోకి వచ్చేశారు. రేపోమాపో శరద్ పవార్ కూడా మాతో కలుస్తారంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు కొంత మందిని హర్ట్ చేశాయి. ఇంకెంత మంది శరద్ పవార్ దగ్గరికి తిరిగి వెళ్లిపోతారో క్లారిటీ లేదు. అజిత్ పవార్ మాత్రం అప్పుడే కొత్త పార్టీ ఓపెనింగ్ వరకూ వెళ్లిపోయారు. కానీ ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. చాలా గ్రాండ్‌గా ఓపెనింగ్ చేద్దామని వెళ్లిన నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఆఫీస్ గేట్‌కి తాళం వేసి ఉంది. తాళాలు కనిపించకుండా పోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ గేట్ ముందే కుర్చీలు వేసుకుని చాలా సేపు పడిగాపులు కాశారు. కాసేపటి తరవాత కొంత మంది యువకులు వచ్చి ఆ తాళం పగలగొట్టారు. ఇక సమస్య తీరిపోయినట్టే అనుకుని లోపలికి వెళ్తే..అక్కడ రూమ్‌లకీ తాళం వేసి ఉంది. వాటి తాళాలూ మిస్ అయ్యాయి. ఈ బంగ్లా ఉద్దవ్ థాక్రేకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబదాస్ ధాన్వేది. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇదే ఆఫీస్‌ని వాడుకున్నారు ధాన్వే. కానీ...ఇప్పుడిదే ఆఫీస్‌ని అజిత్ పవార్ తీసుకున్నారు.
Maharashtra: Ajit Pawar to inaugurate new NCP party office in Mumbai
— ANI Digital (@ani_digital) July 4, 2023
Read @ANI Story | https://t.co/8TmNnf88fd#AjitPawarNCP #Mumbai #AjitPawaer #NCP pic.twitter.com/jtvS7rknsG
ఇదీ కారణం..
అయితే ఈ బంగ్లాలో ఉండే ధాన్వే పీఏ...తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఫలితంగా..అజిత్ పవార్ వర్గంలోని నేతలంతా తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్త ఆఫీస్ ఓపెనింగ్ రోజే ఏంటిదంతా అని అసహనానికి లోనయ్యారు. వెంటనే ఆ పీఏకి కాల్ చేశారు. కాసేపట్లోనే వచ్చి తాళాలిస్తానని చెప్పాక కానీ వాళ్లంతా ఊపిరి పీల్చుకోలేదు. అసలే కొందరు నేతలు శరద్ పవార్‌వైపు మొగ్గు చూపుతున్నారన్న టెన్షన్‌తో ఉన్న అజిత్ పవార్ వర్గానికి..ఈ అనుభవం మరింత టెన్షన్ పెట్టింది. రెండు వర్గాలూ తమదే అసలైన NCP అని తేల్చి చెబుతున్నాయి. శరద్ పవార్ మాత్రం తన పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరినీ తొలగించారు. బలనిరూపణ కోసం ఇప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్ పోటీ పడుతున్నారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు అజిత్ పవార్. అయితే..కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు విషయం చెప్పకుండానే సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నట్టు సమాచారం. వీళ్లు ఒక్కసారిగా ఎదురు తిరిగి శరద్ పవార్‌వైపే వచ్చేస్తే...అజిత్ పవార్‌కి కష్టాలు తప్పవు.
Also Read: Rat in Food: రెస్టారెంట్‌లో చికెన్ కర్రీ తినే ముందు జాగ్రత్త, ఎలుకలుంటాయ్ చూసుకోండి - వైరల్ వీడియో