అన్వేషించండి

Tamil Nadu News: టీ షర్ట్ వేసుకున్నారని డిప్యూటీ సీఎంపై పిటిషన్- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ టీ షర్ట్‌ వేసుకున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది.

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ ధరించిన టీ షర్టు వివాదానికి కారణమైంది. ఆ రాష్ట్ర హైకోర్టులోనే ఏకంగా పిటిషన్ దాఖలైంది. దీన్ని మద్రాస్ హైకోర్టు విచారించింది. మంత్రులకు డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది. 

ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ టీ షర్ట్ ధరించడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే ఉదయించే సూర్యుడి లోగో ఉన్న టీ షర్ట్ ధరించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయానికి విరుద్ధమని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్ అన్నారు.

ఉపముఖ్యమంత్రి ఉదయనిధి టీషర్ట్ ధరించడంపై మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. చెన్నైలోని సెలైయూర్‌కు చెందిన న్యాయవాది సత్య కుమార్ ఈ పిటిషన్ వేశారు. సూర్యోదయం గుర్తు ఉన్న టీషర్ట్ ధరించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సిన డ్రెస్‌ కోడ్‌కు సంబంధించి జూన్ 1, 2019న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO)ను పాటించాలని సత్య కుమార్ అభ్యర్థించారు. ఆ మేరకు ఉదయనిధికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

హైకోర్టు ఆదేశాలు:
ఈ ఆర్డినెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రజాప్రతినిధులుగా ఉన్న మంత్రులకు వర్తించదని ప్రభుత్వ ప్రధాన న్యాయవాది వాదించారు. 

ఈ కేసును న్యాయమూర్తి డి.కృష్ణకుమార్, బి.పి. బాలాజీ, ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. మంత్రులు పాటించాల్సిన డ్రెస్ కోడ్ ఏదైనా ఉంటే.. వాటి గురించి తెలుసుకోవాలని సూచించారు.

నోటీసు అందిన తర్వాత వారంలోగా తన వాదనలను వివరంగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయమూర్తులు చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోరారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget