(Source: Poll of Polls)
Madras High Court Judge: హిందీ రాదు, వాటిని అలానే పిలుస్తా: మద్రాస్ హైకోర్టు జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
Bharatiya Nyaya Sanhita: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత డిసెంబర్‌లో క్రిమినల్ చట్టాల పేర్లను మార్చిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో ఆసక్తికర చర్చ సాగింది.
Justice Anand Venkatesh: కేంద్రంలోని మోదీ(Modi) ప్రభుత్వం గత డిసెంబర్(December)లో క్రిమినల్ చట్టాల పేర్లను మార్చిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఆసక్తికర చర్చ సాగింది.తనకు హిందీ రాదని కొత్త న్యాయ చట్టాలను ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను వాటి అసలు పేర్లతో పిలుస్తూనే ఉంటానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు.
ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్(Justice Anand Venkatesh) ఈ వ్యాఖ్యలు చేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దామోదరన్(Damodaran) ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్‌కు కొత్తగా పెట్టిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(Bhartiya Nagrik Suraksha Sanhita 2023)గా ఉచ్చరించడానికి కష్టపడుతున్నారు. ఆ సయమంలో దామోదరన్ ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న జస్టిస్ ఆనంద్ వెంకటేష్.. తనకు హిందీ భాష రాదని క్రిమినల్ చట్టాల గురించి ఐపీసీగా మాట్లాడతానని అన్నారు.
గత డిసెంబర్ పార్లమెంట్ సెషన్‌లో ఐసీపీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఐసీపీ(IPC)ని ఇండియన్ జ్యుడీషియల్ కోడ్‌గా, సీఆర్‌పీసీని ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్‌గా మార్పు చేశారు.
గతంలో వెంకటేషన్‌ను మెచ్చుకున్న సుప్రీంకోర్టు
గతంలో ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఆనంద్ వెంకటేష్‌ను సుప్రీంకోర్టు అభినందించింది. తమిళనాడు మంత్రి పొన్నమడిపై ఉన్న అవినీతి కేసును సుమోటో ద్వారా జస్టిస్ వెంకటేశ్ మళ్లీ రీఓపెన్ చేశారు. దీనిపై పొన్నమడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు రీఓపెన్ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. సీజేఐ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను పరిశీలించింది. ఈ నేపథ్యంలో సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. థ్యాంక్ గాడ్.. జస్టిస్ వెంకటేశ్ లాంటి వారు జడ్జిలుగా ఉండడం గర్వకారణమని, మన వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తులు అవసరమని అన్నారు. వెంకటేశ్ లాంటి జడ్జి ఉండడం వల్ల ఆ కేసు మళ్లీ రీఓపెన్ అయ్యిందని అన్నారు