మొదటి పెళ్లాం కోసం రెండో భార్య మర్డర్‌కు స్కెచ్- పాములే ఆయుధాలుగా ప్లాన్
MP Crime News: ప్రియుడితో పారిపోయి.. మళ్లీ వచ్చిన మొదటి భార్య కోసం రెండో భార్యను చంపాలనుకున్నాడో వ్యక్తి. అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి మరీ ఆమెకు కాటు వేయించాడు.
MP Crime News: అతడికి పెళ్లైంది. ఓ శిక్షలో జైలుకు వెళ్లగా ఆమె తన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలుసుకున్న అతడు మరో యువతిని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం కూడా చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ మొదటి భార్య ఆయన దగ్గరకు వస్తానంటూ ఫోన్ లు చేయడం మొదలు పెట్టింది. ఇక అంతే మళ్లీ ఆమెతో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేశాడు. అందుకు అడ్డుగా ఉన్న రెండో భార్యను తొలగించుకుంటే మొదటి భార్యను ఇంటికి తీసుకురావచ్చని అనుకున్నాడు. పామును దీనికి ఆయుధంగా చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మేరీ స్మగ్లింగ్ కేసులో జైలు పాలు అయ్యాడు. ఇంతలో అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత ఇంటికి వచ్చిన మోజిమ్ 2015లో మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీళ్ల కాపురం సజావుగా సాగుతున్న టైంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన మొదటి భార్య నుంచి మేసేజ్ వచ్చింది. తనకు ప్రియుడితో ఉండలేనని... వచ్చేస్తానంటూ ఫోన్లు చేసింది.
మొదటి భార్య వస్తానంటూ సతాయిస్తుండటంతో డైలమాలో పడ్డాడు మోజిమ్. చివరకు మొదటి భార్యతోనే ఉండాలని అనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నందున మొదటి భార్య వస్తే సమస్యలు మొదలవుతాయని గ్రహించాడు. అందుకే రెండో భార్యను తప్పిస్తే మొదటి భార్యకు లైన్ క్లియర్ అవుతుందని ప్లాన్ వేశాడు.
రెండో భార్య ససేమిరా అంటుందని గ్రహించి ఆమెను హత్య చేస్తే పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నాడు. అందుకు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. పామునే ఆయుధంగా చేసుకున్నాడు. ఈనెల 8వ తేదీన రాత్రి మోజిమ్ స్నేక్ క్యాచర్ అయిన తన స్నేహితుడు రమేష్ మీనాతో కలిసి ఓ విష పూరిత పామును ఇంటికి తీసుకెళ్లి రెండో భార్యకు కాటు వేయించాడు.
కాటేసిన పాము అత్యంత విషపూరితమైనప్పటికీ రెండో భార్యకు ఏం కాలేదు. పాము కాటేసిన కాసేపటికే ఆమె స్పృహలోకి వచ్చింది. సోదరుడు కాలా సాయంతో శుక్రవారం ఉదయం మరోసారి పామును వదిలాడు. అయినా అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆమెను పాములు ఏం చేయలేకపోయాయి.
పాముల ప్లాన్ ఫెయిల్ అయినా మోజిమ్ వెనక్కి తగ్గలేదు. ప్లాన్ బీ అమలు చేశాడు. ఆమెకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. అంతే ఆమె ప్రమాదంలో పడింది. ఇంతలో విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పింది. బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త మోజిమ్, అతని స్నేహితుడు , తల్లిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యా, పిల్లలను చంపిన భర్త..
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా ఓరంతవాడి గ్రామంలో పళనిస్వామి, వల్లీ అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ సంతానం ఉన్నారు. అయితే కూలీ పనులు చేసుకుంటూ పళనీస్వామి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన పళనీస్వామి కుటుంబాన్ని పట్టించుకోకుండా భాధ్యతారహితంగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో తరచూ పళనీస్వామికి, అతని భార్య వల్లీకి గొడవలు జరిగేవి. అయితే సోమవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పళనీస్వామితో వల్లీ గొడవకు దిగింది. దంపతులు ఇరువురు గొడపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో చిన్నారులు నిద్రిస్తున్నారు. భార్యాభర్తల గొడప పెద్దదై పళనీస్వామి ఇంట్లో ఉన్న గొడలితో నిద్రపోతున్న నలుగురు చిన్నారులను, భార్య వల్లీని హత మార్చాడు. తర్వాత పళనీస్వామి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘటనను గమనించి స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన స్థలంలో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న చిన్నారిని గుర్తించిన పోలిసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్ధితి విషమంగా ఉండడంతో తిరువణ్ణామలై వైద్య కళాశాలలో చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.