అన్వేషించండి

LPG Supply Crunch India: దేశంలో గ్యాస్‌ సంక్షోభం ఉందా? గృహాలు, ఆసుపత్రులు, అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్యానెల్‌ ఏర్పాటు చేశారా? 

LPG Supply Crunch India: ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నుంచి తాజా సమాచారం గృహాలకు,  కీలకమైన సేవలకు అంతరాయం లేకుండా సరఫరాను నిర్ధారించడానికి తీసుకుంటున్న కార్యాచరణ చర్యలను వివరిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గృహాలకు ఎల్‌పీజీకి మొదటి ప్రాధాన్యత, ఉత్పత్తి పది శాతం పెంచారు.
  • బ్లాక్‌ మార్కెట్‌ అరికట్టడానికి 25 రోజుల గ్యాప్‌తోనే రెండో సిలిండర్.
  • ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సరఫరాలో ప్రాధాన్యత కొనసాగుతుంది.
  • వాణిజ్య వినియోగదారులకు ప్రత్యేక కమిటీ ద్వారా గ్యాస్‌ కేటాయింపులు.

LPG Supply Crunch India: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంతో భారత్‌ వంట గ్యాస్‌ సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దేశంలోని మూడు పెద్ద ప్రభుత్వం చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కొన్ని కొత్త రూల్స్‌న ప్రకటించాయి. ఈ నిర్ణయాల వల్ల ఎవరికి లాభం? ఎవరికి ఇబ్బంది? అనే విషయాలను చాలా సింపుల్‌్గా తెలుసుకుందాం. 

ఇళ్లకే మొదటి ప్రాధాన్యత 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. దీని వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. సిలిండర్ల సరఫరాలో సామాన్య గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. గృహాలకు నిరంతరాయంగా గ్యాస్ అందేలా చూడటం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఇందు కోసం చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని పది శాతం పెంచేందుకు అంగీకరించాయి. ఇప్పటి వరకు ఉన్న అదనపు గ్యాస్ కూడా గృహ అవసరాలకే మళ్లించాయి. 

గ్యాస్ బుకింగ్‌‌లో 25 రోజుల కొత్త రూల్

వంట గ్యాస్ సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌ చేయడం లేదా అవసరం లేకపోయినా నిల్వ ఉంచడం వంటి పనులను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్‌ బుక్ చేయడానికి మధ్యలో కచ్చితంగా 25 రోజులు గ్యాప్ ఉండాలి. ఈ రూల్ వల్ల గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం తగ్గుతుందని అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఊరట

గృహ వినియోగదారుల తర్వాత సమాజానికి అత్యంత అవసరమైన రంగాలకు గ్యాస్ సరఫరా ఆగిపోకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. ఆరోగ్య సేవలు, విద్య కార్యక్రమాలు ఆగిపోకూడదని ఉద్దేంతో దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీని కూడా వీరికి మళ్లించాలని నిర్ణయించారు. 

హోటళ్లు, రెస్టారెంట్లకు కష్టాలు తప్పవా?

ఇళ్లు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాణిజ్య వినియోగదారులు అంటే హోటళ్లు రెస్టారెంట్‌లు, చిన్న పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది తప్పదు. వాణిజ్య అవసరాల కోసం దిగుమతి చేసుకున్న గ్యాస్‌పైనే ఎక్కువగా ఆధారపడతాం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ధరలు, సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల వీరికి సరిపడా గ్యాస్  అందకపోవచ్చు. పరిస్థితి సాధారణం స్థితికి వచ్చే వరకు ఈ రంగాలు కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. 

వాణిజ్య వినియోగదారుల కోసం ప్రత్యేక కమిటీ 

వాణిజ్య రంగాల నుంచి వచ్చే గ్యాస్‌ అభ్యర్థనలను పరిశీలించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇండియన్ ఆయిల్ నుంచి కె. శైలేంద్ర, భారత్ పెట్రోలియం నుంచి టీవీ పాండియన్‌, హిందూస్థాన్ పెట్రోలియం నుంచి ధ్రువ్‌ కపిల్ సభ్యులుగా ఉన్నారు. వీరు గ్యాస్ ఆవశ్యకతను బట్టి అందుబాటులో ఉన్న నిల్వలను చూసి ఎవరికి ఎంత సరఫరా చేయాలో నిర్ణయిస్తారు. 

“ఇతర దేశీయేతర రంగాలకు LPG సరఫరా కోసం, ప్రాతినిధ్యాలను సమీక్షించడానికి మరియు LPG సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడానికి చమురు మార్కెటింగ్ కంపెనీల ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేశారు” అని కంపెనీలు తెలిపాయి.

వాణిజ్య సంస్థలు తమ అభ్యర్థనలను ఈ మెయిల్స్‌ ద్వారా పంపవచ్చు. 

ఇండియన్ ఆయిల్ indanecareho@indianoil.in

భారత్ పెట్రోలియం edlpg@bharatpetroleum.in

హిందూస్థాన్ పెట్రోలియం Ipg.sbu.head@hpcl.in 

దిగుమతులు, ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని కాబట్టి కమిటీ ప్రతి ఫిర్యాదును లేదా, అభ్యర్థనను పరిష్కరించ లేకపోవచ్చని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో గ్యాస్ సరఫరాను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. సామాన్య ప్రజల వంట గదిలో మంట ఆరిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇళ్లకు, ఆసుపత్రులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 

Frequently Asked Questions

ప్రభుత్వం ఎందుకు LPG సరఫరాపై కొత్త నిబంధనలు ప్రకటించింది?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల LPG సరఫరాలో ఇబ్బందులు రాకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

LPG సరఫరాలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది?

సామాన్య గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కూడా ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుంది.

వంట గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త రూల్ ఏమిటి?

ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేయడానికి మధ్యలో కచ్చితంగా 25 రోజులు గ్యాప్ ఉండాలి. ఇది సిలిండర్ల దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది.

హోటళ్లు, రెస్టారెంట్లకు LPG సరఫరాలో ఇబ్బందులు వస్తాయా?

అవును, ఇళ్లకు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాణిజ్య వినియోగదారులైన హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది తప్పదు.

వాణిజ్య వినియోగదారుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారా?

అవును, వాణిజ్య రంగాల నుంచి వచ్చే గ్యాస్ అభ్యర్థనలను పరిశీలించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget