Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు, వారంలోగా లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 

Lakhimpur Kheri Case: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేస్తూ (SC cancels bail granted to Ashish Mishra in Lakhimpur Kheri violence case) సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ధర్మాసనం ఆశిష్ మిశ్రాకు సూచించింది. కాగా, ఈ కేసులో ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

అసలేం జరిగిందంటే.. 
యూపీలోని లఖింపుర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు.  వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్‌పై నేడు విడుదలయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ ఆశిష్ బయటకు రావడం ప్రాధాన్యంగా మారింది.

రక్తపాతంగా మారిన రైతుల నిరసన..
గతేడాది అక్టోబర్‌ 3న లఖింపుర్ ఖేరీలో రైతులు శాంతియుతంగా నిరసణ చేస్తుండగా వారి మీద నుంచి కాన్వాయ్ దూసకెళ్లిన ఘటనలో రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లఖింపుర్ ఖేరీ పరిధిలోని టికూనియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దిగువ కోర్టులు ఆశిష్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అల్‌హాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.

మళ్లీ సుప్రీం చెంతకు..
అలహాబాద్ హైకోర్టు రెండు నెలల కిందట మంజూరు చేసిన బెయిల్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా లొంగిపోవడానికి వారం రోజులు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ ఆదేశాలను పాటించి లఖింపూర్ ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా వచ్చే వారంలోగా పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది.

Also Read: Lakhimpur Violence Case: బెయిల్‌పై విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు- యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం 

Also Read: CDS Appointment: విధుల్లో ఉన్న, పదవీ వివరణ చేసిన వారికీ ఛాన్స్, సీడీఎస్ పై కేంద్రం కసరత్తు

Published at : 18 Apr 2022 10:57 AM (IST) Tags: supreme court Farmers Ashish Mishra Lakhimpur Kheri Lakhimpur Violence Case

సంబంధిత కథనాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

SonuSood Foundation :  ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

IAS Couple Dog :  ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ?   బదిలీ అయిన  ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

టాప్ స్టోరీస్

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి