By: ABP Desam | Updated at : 15 Feb 2022 07:09 PM (IST)
Edited By: Murali Krishna
లఖింపుర్ ఖేరీ కేసు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌పై ఈరోజు విడుదలయ్యారు. ఈ కేసులో ఫిబ్రవరి 10న అల్‌హాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
Koo App
గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపుర్ ఖేరీ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లఖింపుర్ ఖేరీ పరిధిలోని టికూనియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కింద కోర్టులు ఆశిష్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అల్‌హాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు బెయిల్ ఇచ్చింది.
ఏం జరిగింది?
యూపీలోని లఖింపుర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు.
దీంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్‌పై నేడు విడుదలయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ ఆశిష్ బయటకు రావడం ప్రాధాన్యంగా మారింది.
Rajyasabha Election Shedule : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - అదృష్టవంతులెవరో ?
TRS @ 21 : టీఆర్ఎస్కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
First Telugu Bibile: వైజాగ్‌లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు బైబిల్ బెంగళూరులో ఎందుకుందీ?
Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
BadLuck Ministers : "నానీ"లు జగన్‌కు ఎలా దూరమయ్యారు ? వారి విషయంలో ఏం జరిగింది ?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!