అన్వేషించండి

Kissing Minor Boy: బాలుడి పెదాలపై ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లైంగిక నేరమా? : బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court Verdict: మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిందని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ వ్యక్తిపై మైనర్ తండ్రి చేసిన ఆరోపణలను హైకోర్టు కొట్టిపారేసింది.

భార్య నుంచి భర్తకు భరణం ఇప్పించడం, భార్యను హత్య చేసిన కేసులో సంచలన తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిందని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ వ్యక్తిపై మైనర్ తండ్రి చేసిన ఆరోపణలను హైకోర్టు కొట్టిపారేసింది. పద్నాలుగేళ్ల బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లైంగిక నేరాలు కావని బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 పరిధిలోకి రావని వ్యాఖ్యానించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.

అసలు వివాదం ఏంటంటే..
తన 14 ఏళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని ముంబైకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో సొమ్ము సైతం పోవడంతో, గుర్తించిన తండ్రి బాలుడ్ని ప్రశ్నించాడు. నగదు తానే తీశానని, ఓ వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానని బాలుడు అంగీకరించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి కుమారుడు చెప్పిన మాటలు విని షాకయ్యాడు. మైనర్ బాలుడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఓ రోజు రీఛార్జ్ చేయించుకునేందకు వెళ్లగా నిందితుడు తన పెదాలపై ముద్దు పెట్టుకున్నాడని, కౌగిలించుకున్నాడని తెలిపాడు.

పోలీసులను ఆశ్రయించిన బాలుడి తండ్రి
తన మైనర్ కుమారుడిపై ఓ వ్యక్తి లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడని గత ఏడాది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. తన కొడుకు పెదాలపై ముద్దు పెట్టుకున్నాడని, కౌగిలించుకుని ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడని.. పోస్కో చట్టం‌తోపాటు వికృత లైంగిక చర్యలకు పాల్పడ్డాడని సెక్షన్ 377 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. దోషిగా తేలితే నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసును విచారించిన జస్టిస్ ప్రభుదేశాయ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ ప్రకారం బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకుని అసభ్యంగా తాకడం అసహజ లైంగిక నేరాలు కావని స్పష్టం చేశారు.

నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. కనుక పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టడానికి సమయం పడుతుందని భావించి రూ.30 వేలు వ్యక్తిగత పూచీకత్తులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: Woman alimony to husband : విడాకులు ఇచ్చేస్తే ఏమైపోవాలి ? కోర్టుకెళ్లి భరణం తెచ్చుకున్న భర్త !  

Also Read: Bombay High Court: భర్తను రోడ్డుపైనే ‘నపుంసకుడు’ అని అరిచిన భార్య, తర్వాత ఘోరం, బాంబే హైకోర్టు సంచలన తీర్పు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget