By: ABP Desam | Updated at : 31 Mar 2022 06:08 PM (IST)
భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన హైకోర్టు
విడాకులు అంటే భార్యకు మాత్రమే అన్యాయం జరుగుతుందా ? భర్తకు భరణం ఇవ్వాల్సిన కేసులు కూడా ఉంటాయి. కానీ విడాకులు అంటే.. అదేదో భర్తనే ఇస్తున్నాడన్న ఓ భావనతో ఇంత కాలం ఆ భర్తలకు అన్యాయం జరుగుతూ వస్తోంది.ఇప్పుడు వారికి కాస్త ధైర్యం ఇచ్చే తీర్పు వచ్చింది. అదేమిటంటే.. భార్యనుంచి భర్త కూడా భరణం కోరవచ్చు. అలా కోరడమే కాదు.. కోర్టుకెళ్లి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నాడు ఓ భర్త.
మద్యం తాగేవాళ్లంతా మహా పాపులు - శాపనార్థాలు పెట్టిన సీఎం !
మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు 1992లో పెళ్లయింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ భర్త పెళ్లయిన తర్వాత కూడా భార్యను చదువుకునేందుకు ప్రోత్సహించాడు. చాలా ఖర్చు పెట్టాడు. చివరికి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే ఆ భర్తకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయింది. కానీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా అనుకున్నాడు. కొన్నాళ్లకు భర్త ఏమీ సంపాదించడం లేదన్న కారణంతో వచ్చిన కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య.. నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది.
పెళ్లి చేయని కుమార్తెకు పెళ్లి ఖర్చులు ఇవ్వాల్సిందే - ఓ తండ్రికి చత్తీస్‌ఘడ్ కోర్టు ఆదేశం !
అయితే ఇలా తనను అర్థంతరంగా వదిలేస్తే తన జీవితం ఎం కావాలనుకున్న ఆ భర్త.. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. తనకు జీవనాధారం ఏమీ లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి వేతనం తీసుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపినకోర్టు భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. అయితే భార్య ఔరంగాబాద్ హైకోర్టును ఆశ్రయించింది .
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. సివిల్ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు.. సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే, వీడాకులు తీసుకునే భార్య.. భర్తకు భరణం ఇవ్వాలని బొంబాయి హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?
Yasin Malik Case Verdict: మాలిక్‌కు జీవిత ఖైదుతోపాటు జరిమానా కూడా విధించిన కోర్టు- తీర్పు పూర్తి వివరాలు ఇవే
Five Congress Leaders : కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?
Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు
Karnataka News: ఏందిరా నీ సారీ గోల- కాలేజీ గోడలు, మెట్ల నిండా 'సారీ' కోటి!
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!