By: ABP Desam | Updated at : 26 Jul 2022 08:32 AM (IST)
సొంతంగా నిర్మించుకున్న సమాధిలో అంత్యక్రియలు
Karnataka Man who built his own tomb 20 years ago: కొందరు చేసే పనులు అవతలి వారిని ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఓ పెద్దాయన చేసిన పని ఎంతో ఆలోచనాత్మకంగా, ఆత్మాభిమానికి ప్రతీకగా నిలుస్తోంది. వయసులోనే కాదు, మనసులోనే పెద్దాయన అనిపించుకున్నాడు ఆ వృద్ధుడు. చనిపోవడానికి 20 ఏళ్ల ముందే తన డబ్బులతోనే సమాధి నిర్మించుకున్నాడు కర్ణాటకకు చెందిన వ్యక్తి. తాజాగా ఆయన కన్నుమూయడంతో సొంతంగా నిర్మించుకున్న సమాధిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
కర్ణాటకలోని చామరాజనగర్ తాలుకాలోని నంజదేవనపుర గ్రామంలో పుట్టమల్లప్ప అనే 85 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. ప్రస్తుత రోజుల్లో పరిస్థితులను కొన్నేళ్ల కిందట అర్థం చేసుకున్న పెద్దాయన రెండు దశాబ్దాల కిందట కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయాక సైతం ఎవరి మీద ఆధారపడవద్దని, తన అంత్యక్రియలు సొంత డబ్బులతోనే జరగాలని భావించాడు. ఆలోచించడమే కాదు ఆచరించి చూపించాడు. 20 ఏళ్ల కిందట సొంత డబ్బులు వెచ్చించి తన సమాధి నిర్మించుకున్నాడు పుట్టమల్లప్ప. సమాధి ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపు లక్ష రూపాయల నగదును అంత్యక్రియల కోసం దాచిపెట్టాడు. వాటిని తాను చనిపోయాక వినియోగించాలని కుటుంబసభ్యులకు, బంధువులకు ఏళ్ల కిందటే చెప్పాడు.
మనసున్న ధనవంతుడే..
పుట్టమల్లప్ప ధనవంతుడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే కరోనా సోకడంతో గత ఏడాది ఆయన భార్య కన్నుమూసింది. అప్పుడు కూడా తాను సొంతంగా సంపాదించిన నగదుతోనే భార్య అంత్యక్రియలు, కర్మ కాండలు జరిపించాడు. తాను చనిపోతే కుమారులకు బారం కాకూడదని, తన డబ్బులతోనే సమాధి నిర్మించుకున్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట సమాధి నిర్మించుకోవడంతో పాటు అంత్యక్రియలు, కర్మల కోసం నగదు సిద్ధం చేశారని ఆయన కుమారుడు గౌడికే నగేశ్ తెలిపారు.
సొంత డబ్బులతో అంత్యక్రియలు..
గత వారం పుట్టమల్లప్ప అస్వస్థతకు గురయ్యారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆ పెద్దాయన ఆదివారం కన్నుమూయగా.. ఆయన రెడీ చేసిన నగదుతోనే అంత్యక్రియలు నిర్వహించారు. తన తండ్రికి ఆత్మాభిమానం ఎక్కువని నగేశ్ తెలిపాడు. తన తండ్రి చివరి కోరిక అదేనని, ఆయన అనుకున్న విధంగానే సొంతంగా నిర్మించుకున్న సమాధిలో చివరి తంతు కార్యక్రమాలు జరిపించామన్నారు. పెద్ద కర్మ లాంటి వాటికి సైతం పుట్టమల్లప్ప ఇచ్చిన డబ్బులనే వినియోగిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.
Also Read: Benefits of Crying: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది
Also Read: Trending Lifestyles: హడావిడి జీవితానికి ఓ బ్రేక్ అవసరమే - మీరు ఎప్పుడైనా ఇలా గడిపారా ?
India's Policy and Decisions: భారత్ను ప్రత్యేకంగా నిలిపిన పాలసీలు ఇవే, వాటి వివరాలు ఇదిగో
Election For Congress Chief: కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!
Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!
Digital Rupee: డిజిటల్ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!
India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!