Benefits of Crying: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది
ఏడవకండి అని చాలా మంది అంటారు,కానీ ఏడుపు వస్తే ఏడవడమే ఉత్తమమైన పద్ధతి.
![Benefits of Crying: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది Don't stop crying, crying is good for health Benefits of Crying: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/aafd93471b76f989ba646f2731bf9e681658758298_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మీరు ఏడుస్తున్నప్పుడు చాలా మంది ‘కన్నీళ్లు వృధా చేసుకోకండి’, ‘ఏడుపు వల్ల ఉపయోగం లేదు’... ఇాలా చాలా డైలాగులు చెబుతారు. నిజానికి ఏడవడం మీకు మేలే చేస్తుంది. కన్నీళ్లు వచ్చే సందర్భాల్లో మీరు ఏడుపును బలవంతంగా ఆపుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మరింతగా దిగజారుతుంది. ఏడుపు బలహీనతకు చిహ్నంగా భావిస్తారు కానీ, గుండె మోయలేనంత భారం పెరిగినప్పుడు దాన్ని తేలిక చేసేది ఏడుపే. అందుకే మిమ్మల్ని మీరు మరింత బలంగా మార్చుకోవాలంటే ఏడవాల్సిందే. ఏడ్చాక చూడండి మీకు మీరే ఎంతో బలంగా అనిపిస్తారు. ఏడుపు వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
మీ భావోద్వేగాలు, ఒత్తిడి బయటికి పోవాలంటే ముఖ్యమైన పని ఏడవడమే. మీరు కన్నీళ్ల రూపంలో అధిక ఒత్తిడిని బయటికి పంపించేయవచ్చు. ఇది మీకు అన్ని విధాలుగా మేలే చేస్తుంది. పరిశోధన ప్రకారం మానసిక ఒత్తిడిలో కేకలు వేయడం కన్నా ఏడ్చేయడం బెటర్.
కళ్లను తేమవంతంగా...
కన్నీళ్లను కళ్లను శుభ్రం చేస్తాయి. మనసుకు తేలికపరుస్తాయి. కళ్లు పొడిగా మారడాన్ని నిరోధిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కాబట్టి ఏడుపు కంటికి మంచిదే.
కనెక్షన్ పెంచుతుంది
మీ భావాలను,ఉద్వేగాలను సన్నిహితులకు చెబుతూ ఏడవడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. వేరే వాళ్లకి మీ గుండెలోని భారాన్ని చెబుతూ ఏడవడం మరింతగా మనసును తేలికపరుస్తుంది.
టాక్సిన్లను తొలగించి..
మానసిక క్షోభ కారణంగా మీ కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లతో పాటూ కళ్లలో ఉన్న దుమ్మూ ధూళి, టాక్సిన్లు కూడా తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషన్ వంటివి త్వరగా తొలగిపోతాయి.
పాజిటివిటీని పెంచుతుంది
మీ లోపల దాగి ఉన్న బాధ లేదా చేదు గాయం తాలూకు మానసిక క్షోభ బయటికి పోతేనే ఏదైనా బాధ పోతుంది. అలా పోవాలంటే ఏడవాలి. అలా ఏడుపు ద్వారా బాధ బయటికి పోతే గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి భావోద్వేగాలను బయటికి రాకుండా అడ్డుకోవద్దు.
Also read: ఫిష్ నిర్వాణ- అరటి ఆకులో టేస్టీ చేపల ఫ్రై, పెనంపై వేయించుకోవచ్చు
Also read: చపాతీలు చేసేటప్పుడు ఈ పదార్థం కలపండి, త్వరగా బరువు తగ్గుతారు
Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)