Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధిక సీట్లు, అయినా తప్పని ఉత్కంఠ !
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 13న నేతల భవితవ్యం తేలనుంది. అయితే ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 అప్ డేట్స్ ఇలా ఉన్నాయి.
LIVE
Background
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించింది ఈసీ. మొత్తం 5 కోట్ల మంది ఎవరికి ఓటు వేశారు అనేది కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకే 66 శాతం పోలింగ్ జరిగింది. ఆరు గంటల వరకు 70 శాతానికి నమోదయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఓటింగ్ శాతం మరితం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఎంత శాతం ఓటు హక్కు నమోదయిందన్నది గురువారం ఉదయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కర్ణాటక మొత్తం ఒకేఫేజ్‌లో ఎన్నికలు
కర్ణాటక మొత్తం ఒకే ఫేజ్‌లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. చెదురుమదులు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగాయి. విజయపుర జిల్లాలోని మసబినళలో స్థానికులు ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడులు చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులకు దిగారు స్థానికులు.
గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదయ్యే అవకాశం
బిసాన, దోనూరు గ్రామం నుంచి రిజర్వు చేసిన ఓటింగ్ యంత్రాలను తిరిగి విజయపురానికి తీసుకువస్తుండగా స్థానికులు అడ్డుకుని ఈ దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈవీఎం,వీవీ ప్యాడ్ యంత్రాలను వెనక్కి పంపించటంపై స్థానికులు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. దానికి అధికారులు సరిగా స్పందించకపోవటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తు దాడులకు దిగినట్లుగా తెలిపారు. ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ సారి కర్ణాటకలో సీజ్ చేసిన డబ్బుల విలువ పెరిగిపోయింది. ఎన్నికల ఖర్చుపై నిఘా పెట్టిన ఈ సంస్థ..కీలక విషయాలు వెల్లడించింది. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే... ఈ సారి 4.5 రెట్లు ఎక్కువగా డబ్బుని సీజ్ చేసినట్టు స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పలు చోట్ల ఈ నోట్ల కట్టల్ని సీజ్ చేశాయి. వీటి మొత్తం విలువ రూ.375 కోట్లుగా వెల్లడించింది. రూ.147 కోట్ల క్యాష్, రూ.84 కోట్ల విలువైన లిక్కర్, రూ.97 కోట్ల బంగారం వెండి, రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
"ఎలాంటి అక్రమాలు, అవినీతి లేకుండా ఎన్నికలు నిర్వహించడంపై మేం కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే ఎన్నికల ఖర్చుపై నిఘా పెడుతున్నాం. వాటిని నియంత్రిస్తున్నాం. ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్నాం. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ సారి డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపించింది. అప్పటి కంటే 4.5 రెట్లు ఎక్కువగా సీజ్ చేశాం. ఇలాంటి అక్రమాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్ద మొత్తంల కరెన్సీ నోట్లు తరలి వస్తున్నాయి. కో ఆర్డినేషన్ టీమ్స్ ఇలాంటి ముఠాలను పట్టుకునే పనిలో ఉన్నాయి. బీదర్‌లో 100 కిలోల గంజాను సీజ్ చేశాం. డబ్బులు ఏరులై పారే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాం." - కేంద్ర ఎన్నికల సంఘం
ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దుతుగా నిలిచిన ప్రజలకు, కార్యకర్తలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసం మంచిగా, గౌరవప్రదంగా ప్రచారం నిర్వహించినందుకు ప్రశంసించారు. మంచి భవిష్యత్ కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని రాహుల్ గాంధీ అన్నారు.
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు..
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు..
ABP CVoter Exit Poll survey
మొత్తం సీట్లు – 224
బీజేపీ- 83 నుంచి 95 సీట్లు
కాంగ్రెస్- 100 నుంచి 112 సీట్లు
జేడీఎస్ - 21 నుంచి 29 సీట్లు
ఇతరులు- 2 నుంచి 6 సీట్లు
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటకలో ఎవరికి ఎంత ఓట్ షేర్ ?
Karnataka Exit Poll 2023 LIVE Updates: కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికంగా ఓట్లు పోలింగ్..
ABP CVoter Exit Poll survey
మొత్తం సీట్లు - 224
బీజేపీ - 38% ఓట్లు
కాంగ్రెస్ - 41% ఓట్లు
JDS - 15% ఓట్లు
ఇతరులు- 6% ఓట్లు
Karnataka Exit Poll 2023 LIVE Updates: హైదరాబాద్ - కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ కు ఎడ్జ్..
Karnataka Exit Poll 2023 LIVE Updates: హైదరాబాద్ - కర్ణాటక రీజియన్ లో పార్టీలకు సీట్లు ఇలా రావొచ్చు..
ABP CVoter Exit Poll survey
మొత్తం సీట్లు - 31
బీజేపీ- 11 నుంచి 15 సీట్లు
కాంగ్రెస్ - 13 నుంచి 17 సీట్లు
జేడీఎస్ - 0 నుంచి 2 సీట్లు
ఇతరులు- 0 నుంచి 3 సీట్లు
Karnataka Exit Poll 2023 LIVE Updates: హైదరాబాద్ - కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ జోరు
Karnataka Exit Poll 2023 LIVE Updates: హైదరాబాద్ - కర్ణాటక రీజియన్ లో పార్టీలకు ఓటింగ్ షేర్..
ABP CVoter Exit Poll survey
మొత్తం సీట్లు - 31
బీజేపీ - 38% ఓట్లు
కాంగ్రెస్ - 44% ఓట్లు
JDS - 13% ఓట్లు
ఇతరులు - 5% ఓట్లు