Jharkhand Man Eats Two Snakes Alive:మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?
Drunk Man Bites Snake: జార్ఖండ్‌లో మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన వింత పని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలంలో నుంచి వచ్చిన పామును పట్టుకుని బతికుండగానే కొరికి తినేశాడు బుధన్ భారతి అనే వ్యక్తి.

Shocking Viral News: మద్యం మత్తు మనుషులను ఏ స్థాయికి దిగజారుస్తుందో, ఎలాంటి వికృత పనులకు పురికొల్పుతుందో నిరూపించే ఒక ఒళ్లు గగుర్పొడిచే వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. చత్రా జిల్లా పరిధిలో శనివారం రాత్రి ఒక 46 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా రెండు పాములను బతికుండగానే కొరికి, నమిలి మింగేశాడు. అనంతరం అతని శరీరం పాలిపోయి, తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఉదంతం స్థానికంగానే కాకుండా జాతీయ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చత్రా జిల్లా కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాడిహ్ తోలా గ్రామానికి చెందిన బుధన్ భారతి అనే వ్యక్తి శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి పొలం సమీపంలో కూర్చుని విపరీతంగా మద్యం సేవించాడు. ఆపై వారంతా కలిసి అక్కడే పేకాట ఆడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలాల్లో నుంచి ఒక పాము జరజర ప్రాకుకుంటూ బుధన్ భారతి వైపునకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న అతడిని కరిచేందుకు ఆ పాము ప్రయత్నించింది.
పామును చూసి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, గ్రామస్థులు భయంతో పక్కకు తప్పుకోవాలని బుధన్‌ను గట్టిగా హెచ్చరించారు. కానీ, అప్పటికే మత్తులో ఊగిపోతున్న బుధన్.. భయపడాల్సింది పోయి, ఆ పామును తన ఒట్టి చేతులతో పట్టుకుని, నోటితో బతికుండగానే కొరికి ముక్కలు ముక్కలుగా నమిలి మింగేశాడు.
అంతటితో ఆగని బుధన్ భారతి వింత ప్రవర్తన అక్కడి వారిని మరింత భయాందోళనలకు గురిచేసింది. మొదటి పామును తిన్న వెంటనే.. అతను పక్కనే ఉన్న మరో పొలంలోకి పరుగు తీశాడు. అక్కడ కొద్దిసేపటి క్రితమే గ్రామస్థులు కొట్టి చంపిన మరో పాము పడి ఉంది. ఏమాత్రం అసహ్యం లేకుండా ఆ చచ్చిన పామును కూడా చేతుల్లోకి తీసుకుని, దానిని కూడా పూర్తిగా తినేశాడు. ఆ తర్వాత కూడా ఏమీ తెలియనట్లు మళ్లీ వచ్చి మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఈ లోపు మూడో పామును పట్టుకోవడానికి సిద్ధమవుతుండగా.. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నారు.
రెండు పాములను తిన్న కొద్దిసేపటికే బుధన్ భారతి ఆరోగ్యం వేగంగా క్షీణించింది. విష ప్రభావం వల్లో లేదా కెమికల్ రియాక్షన్ వల్లో అతని శరీరం మొత్తం తెల్లగా పాలిపోవడం ప్రారంభమైంది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు అతడిని తక్షణమే ప్రతాప్‌పూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల బృందం అతనికి అత్యవసర చికిత్స అందించింది. అయితే, అతను తిన్న పాములు ఏ జాతికి చెందినవి, అవి ఎంతవరకు విషపూరితమైనవి అనే విషయాలపై స్పష్టత లేదు. అతనికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.
ట్రెండింగ్ వార్తలు






















