Cross Border Love Story: సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
Snapchat Romance: నిప్పుల కొలిమి లాంటి సరిహద్దు.. కట్టుదిట్టమైన కాపలా.. కానీ ప్రేమానురాగాల ముందు అవేవీ నిలవలేదు. ఎల్‌ఓసీ దాటి వచ్చిన పీఓకే యువకుడు , ఉరీ యువతి ప్రేమకథ ఇదీ

Indian Army Humanitarian Repatriation PoK: ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిరంతరం సైనికుల పహారా, ఎటు చూసినా గస్తీ కాసే తుపాకులు.. ఇదీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు రేఖ . కానీ, శత్రుదేశాల మధ్య ఉన్న ఆ మారణాయుధాల భయం కూడా రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమను ఆపలేకపోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు జీషాన్ మీర్, సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ పరిధిలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా సాగిన వీరి డిజిటల్ ప్రేమకథ.. చివరకు ఒక ఉత్కంఠభరితమైన సరిహద్దు థ్రిల్లర్‌లా మారి.. జూలై 4, 2026 శనివారం నాడు ఎంతో ఎమోషనల్ క్లైమాక్స్‌కు చేరింది.
అసలు కథ మే 31, 2026 న ప్రారంభమైంది. కుటుంబంలో పెళ్లి చేసుకోమనే ఒత్తిడి తట్టుకోలేక, తన ప్రేమను గెలిపించుకోవాలనే పిచ్చితో జీషాన్ మీర్ కాలికి కేవలం చెప్పులు వేసుకుని, చేతిలో ఐడెంటిటీ కార్డ్, మొబైల్ పట్టుకుని అత్యంత ప్రమాదకరమైన ఉరీ సెక్టార్‌లోని సిలికోట్ సరిహద్దు కంచెను దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. దారిలో ఒక చిరుతపులి కంట్లో పడినా ప్రాణాలకు తెగించి ముందుకు సాగాడు. బోర్డర్ దాటగానే ఇరమ్‌కు మెసేజ్ చేశాడు. జీషాన్ వచ్చాడనే సమాచారం తెలియగానే ఇరమ్ తన ఇంటి కిటికీలోంచి దూకి, సరిహద్దు చెక్‌పోస్ట్ వైపు పరుగెత్తింది. అప్పటికే అప్రమత్తమైన భారత సైన్యం జీషాన్‌ను చొరబాటుదారుడిగా భావించి అదుపులోకి తీసుకుంది. ఆర్మీ జవాన్ల ముందే ఇరమ్ రోదిస్తూ.. అతను తీవ్రవాది కాదని, తనను చూడటానికే వచ్చాడని నిజం చెప్పడంతో ఈ ప్రేమకథ మొదటి మలుపు తిరిగింది.
జీషాన్‌ను పోలీసులు ఫారినర్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి బారముల్లా జైలుకు తరలించారు. కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జీషాన్ మొబైల్, కాల్ డేటాను పూర్తిగా జల్లెడ పట్టి.. అతనికి ఎలాంటి ఉగ్రవాద ఉద్దేశాలు లేవని, కేవలం ప్రేమ కోసమే వచ్చాడని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ అసాధారణ లవ్ స్టోరీని పరిశీలించిన ఉరీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. మానవతా దృక్పథంతో వ్యవహరించింది. యువకుడిది చొరబాటు లేదా దేశద్రోహ కుట్ర కాదని, కేవలం ప్రేమించిన అమ్మాయిని చూడాలనే అమాయకపు ప్రయత్నమేనని అంగీకరిస్తూ కేసును కొట్టివేసి, అతని విడుదలకు, స్వదేశానికి పంపడానికి ఆదేశాలు జారీ చేసింది. భారత సైన్యం కూడా జీషాన్‌ను జైలులో అత్యంత గౌరవంగా, ఒక అతిథిలా చూసుకుని భారతీయ మానవతా విలువలను చాటుకుంది. కోర్టు ఆర్డర్ రావడంతో పాక్ అధికారులతో మాట్లాడి జీషాన్‌ను తిరిగి పంపించేందుకు శనివారం మధ్యాహ్నం ఉరీలోని ప్రముఖ కమాన్ అమన్ సేతు వంతెన వద్దకు తీసుకువచ్చారు.
A PoK man allegedly crossed the LoC to meet a woman he met on Snapchat before being detained and repatriated.
— shorts91 (@shorts_91) July 4, 2026
Read more on, https://t.co/CYeKt8cbU3 #PoK #LoC #Uri #SnapchatFriend #IndianArmy #BorderPatrol pic.twitter.com/QqMAB6bQMa
అక్కడ సరిహద్దు గేట్ల మధ్య.. ఇరమ్ బానో కుటుంబానికి, జీషాన్ మీర్‌కు కలిసేందుకు అధికారులు కేవలం మూడు నిమిషాల సమయం ఇచ్చారు. ఆ మూడు నిమిషాల ఎమోషనల్ సీన్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లను తడిపింది. నువ్వేం బాధపడకు, ఏడవద్దు.. నేను బాగున్నాను అని జీషాన్ ఇరమ్‌కు ధైర్యం చెప్పాడు. ఇరమ్ కుటుంబం అతనికి కొత్త బట్టలు, బూట్లు కొని ఇచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జీషాన్‌ను భారత సైన్యం అధికారికంగా పాక్ సైనికులకు అప్పగించింది. ప్రస్తుతం ఈ విడిపోయిన ప్రేమికుల కుటుంబాలు.. భవిష్యత్తులో వీసా ద్వారా చట్టబద్ధంగా ఇరమ్‌ను పాకిస్తాన్ తీసుకెళ్లి, ఇద్దరికీ అధికారికంగా పెళ్లి చేయాలని ఆశిస్తున్నారు. ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా మొదలైన ఈ సరిహద్దు ప్రేమకథ.. తుపాకుల నీడలో శిక్షతో కాకుండా మానవత్వంతో కూడిన ఒక అందమైన ఆశతో ముగిసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















