అన్వేషించండి

షార్ట్‌లు మినీ స్కర్ట్‌లు వేసుకుని వస్తే ఆలయంలోకి అడుగు పెట్టనివ్వం - భక్తులకు వార్నింగ్

Jain Temple Rules: షిమ్లాలోని ఓ జైన మందిరం షార్ట్‌లు, స్కర్ట్‌లు వేసుకుని ఆలయంలోకి అడుగు పెట్టకూడదని తేల్చి చెప్పింది.

Jain Temple Rules: 


జైన మందిరంలో ఆంక్షలు..

షిమ్లాలోని వందేళ్ల చరిత్ర ఉన్న జైన మందిర యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. షార్ట్‌లు, మినీ స్కర్ట్‌లు వేసుకుని వస్తే అనుమతించమని తేల్చి చెప్పింది. కురచ దుస్తులపై నిషేధం విధించింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిండుగా దుస్తులు వేసుకుని వచ్చినా వాళ్లనే అనుమతిస్తామని వెల్లడించింది. మందిరానికి పద్ధతిగానే రావాలని స్పష్టం చేసింది. ఈ డ్రెస్‌కోడ్‌కి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. మందిరం బయటే ఈ నోటీసులు అంటించింది. శ్రీ దిగంబర్ జైన్ సభ నేతృత్వంలో ఈ ఆలయం నడుస్తోంది. 

"ఈ మందిరానికి వచ్చే మహిళలు, పురుషులు పద్ధతిగా డ్రెస్‌లు వేసుకుని రావాలి. కురచ దుస్తులు, షార్ట్‌లు, మినీ స్కర్ట్‌లు, నైట్‌సూట్‌లు, టార్న్ జీన్స్, ఫ్రాక్‌లు, జీన్స్‌లు..ఇలా ఏది పడితే అది వేసుకుని వస్తే లోపలకి అనుమతించం. ఇలాంటివేవైనా ఆలయం బయటే వేసుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం పద్ధతిగానే ఉండాలి. హిందూ సంప్రదాయాన్ని రక్షించడంలో భాగందానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మనకంటూ కొన్ని విలువలున్నాయి. వాటిని కాపాడుకోవాలన్నదే మా ఉద్దేశం. "

- ఆలయ నిర్వాహకులు 

సంస్కృతిని గౌరవించండి..

అసలు ఈ రోజుల్లో ఆలయాలను సందర్శించడమే ప్రజలు మర్చిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు జైన మందిర నిర్వాహకులు. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఎలాంటి ఆసక్తి చూపించడం లేదని మండిపడ్డారు. మన ముందు తరం వాళ్లు తప్పకుండా ఆలయాలకు వెళ్లే వాళ్లని, నిండైన దుస్తులు ధరించే వాళ్లని చెప్పారు. కానీ...ఇప్పుడు చాలా మంది కురచ దుస్తులతో ఆలయాలకు వస్తుండటం అసహనానికి గురి చేస్తోందని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి మన మతాచారాలను గౌరవించాలని సూచించారు. 

హౌజింగ్ సొసైటీలో డ్రెస్ కోడ్..

గ్రేటర్ నోయిడాలోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఏరియాల్లో తిరిగేటప్పుడు కాస్త పద్ధతిగా డ్రెసింగ్ చేసుకోవాలని ఆదేశించింది. హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్‌లో ఈ రూల్ పెట్టారు. జూన్ 10వ తేదీన ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. చాలా మంది పార్కింగ్, కామన్ ఏరియాల్లో పురుషులు లుంగీలతో, మహిళలు నైటీలతో తిరుగుతుండటం సొసైటీ గమనించింది. ఇకపై ఇంకెప్పుడూ అలా కనిపించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ఈ సర్క్యులర్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అవడమే కాదు...పోలీసుల వరకూ వెళ్లింది వ్యవహారం. నెటిజన్లైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. "పర్సనల్ ఛాయిస్‌ ఉండదా" అని తిట్టి పోస్తున్నారు. డ్రెస్‌ కోడ్ పేరుతో విడుదల చేసిన ఆ సర్క్యులర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Viral Video: హాస్పిటల్ లిఫ్ట్‌లోకి స్కూటర్, వీల్‌ఛైర్ లేదని కొడుకుని ఇలా తీసుకెళ్లాడు - వైరల్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget