IRCTC Packed Food In general Coach: జనరల్ కోచ్ ప్రయాణికులకు సీటు వద్దకే ఫుడ్ సప్లై, IRCTC న్యూ ఫెసిలిటీ ప్రారంభం
IRCTC New Facility: సాధారణ కోచ్ ప్రయాణికులకు IRCTC కొత్త సేవ అందుబాటులోకి తీసుకురానుంది. సీటు వద్దనే ప్యాక్ చేసిన ఆహారం, నీరు అందించబోతోంది.

IRCTC Packed Food In general Coach: దేశవ్యాప్తంగా రైలు ద్వారా ప్రతిరోజూ 2.5 కోట్లకుపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణిస్తారు. అలాగే, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో కూడా ప్రయాణిస్తారు. ట్రైన్‌లో రిజర్వ్ కోచ్‌లు, స్లీపర్, AC కోచ్‌లు ఉన్నాయి. జనరల్ కోచ్‌లతో పోల్చుకుంటే రిజర్వ్ కోచ్‌లో ప్రయాణించే వాళ్లకు సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్ కోచ్‌ల ట్రావెల్ చేసే వాళ్లకు మాత్రం తక్కువ సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్లకి కూడా సౌకర్యాలు కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది.
రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు వారి సీటు వద్దకే ఆహారం, నీరు తీసుకొచ్చి ఇస్తారు.అయితే, ఇప్పుడు IRCTC జనరల్ కోచ్ కోసం ఒక కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద జనరల్ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా వారి సీటు వద్దకే ప్యాక్ చేసిన ఆహారం, నీరు లభిస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
జనరల్ కోచ్‌లో సీటు వద్దకే ఆహారం, నీరు
భారతీయ రైల్వే జనరల్ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఒక ప్రత్యేక సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇప్పుడు జనరల్ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రయాణ సమయంలో మంచి నాణ్యత గల ఆహారం, నీరు IRCTC ద్వారా అందిస్తోంది. అది కూడా కేవలం 80 రూపాయలకు. ఈ ఆహారంలో పప్పు, అన్నం, కూరగాయలు, రోటీ, ఊరగాయలు ఉంటాయి. స్పూన్లు, నేప్‌కిన్‌లు కూడా ఇస్తోంది. ఇప్పటి వరకు ఇది కేవలం రిజర్వ్ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే కల్పించేది. ఇప్పుడు దాన్ని జనరల్ కోచ్ ప్రయాణికులకు విస్తరించింది.
ఆహారం పరిమాణం గురించి మాట్లాడితే, అది సాధారణ ప్రయాణికుడి కడుపు నింపడానికి సరిపోతుంది. ప్యాకింగ్ కూడా చాలా మంచి నాణ్యతతో ఉంటుంది. అంటే, రైల్వే స్లీపర్, AC కోచ్‌లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని అందిస్తుంది. అదే విధంగా జనరల్ కోచ్ ప్రయాణికులకు వారి సీటులో ఆహారం అందిస్తోంది.
ఈ రైళ్లలో ఈ సౌకర్యం లభిస్తుంది
IRCTC జనరల్ కోచ్ ప్రయాణికులకు సీటులో ఆహారం అందించే సౌకర్యాన్ని ఆరు రైళ్లలో ప్రారంభించింది. వీటిలో గోమతి ఎక్స్‌ప్రెస్, శ్రీనగర్ గంగానగర్-న్యూ ఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కైఫియత్ ఎక్స్‌ప్రెస్, అయోధ్య ఎక్స్‌ప్రెస్, బరౌని-లోని ఎక్స్‌ప్రెస్, దర్భంగా-న్యూ ఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇప్పుడు మంచి నాణ్యత గల ఆహారం, నీరు తక్కువ ధరలకు నేరుగా వారి సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తోంది.
రైల్వే ప్రణాళిక ఏమిటంటే, ఈ సౌకర్యాన్ని వీలైనంత త్వరగా మరిన్ని రైళ్లలో అమలు చేయాలని చూస్తోంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు దీని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి త్వరలో వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో వంటి మరో మూడు స్టేషన్ల నుంచి కూడా ఇది ప్రారంభం కావచ్చు. ఇక్కడ విజయవతంగా అమలు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని స్టేషన్‌లలో కూడా ప్రారంభించే అవకాశం ఉంది.





















