Indian Railway Rules: కారణం లేకుండా రైలులో చైన్ లాగుతున్నారా? జరిమానా, జైలుశిక్ష తప్పవు! రైల్వే రూల్స్ తెలుసుకోండి
Chain pulling in Trains | రైలులో కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చైన్ లాగడానికి రూల్స్ అంగీకరిస్తున్నాయి. అనవసరంగా రైలులో చైన్ లాగితే వారికి భారతీయ రైల్వే యాక్ట్ ప్రకారం శిక్ష విధిస్తుంది.

Indian Railway rules for chain pulling: భారతదేశంలో రోజూ దాదాపు 3 కోట్ల మంది వరకు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా దేశ జనాభాకు దాదాపుగా సమానం. అయితే రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే పలు నియమాలను అమలు చేస్తోంది. ప్రయాణికులంతా రైలు ప్రయాణ సమయంలో వీటిని తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే అందుకు భారతీయ రైల్వే నియమాల ప్రకారం శిక్ష విధిస్తారు.
రైళ్లలో అత్యవసర పరిస్థితులకు చైన్ పుల్లింగ్ అనే అవకాశం ఉంది, కానీ కొందరు ప్రయాణికులు అనవసరంగా రైలు వెళ్తుండగా చైన్ లను లాగుతున్నారు. అలా చేసేవారు చట్టవిరుద్ధంగా నేరం చేసినట్లే. అనవసరంగా చైన్ లాగడం వల్ల భారతీయ రైల్వే ఎంత శిక్ష విధిస్తుంది ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సందర్భాల్లో చైన్ లాగవచ్చు
భారతీయ రైల్వే నియమాల ప్రకారం, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగవచ్చు. ఉదాహరణకు అత్యవసర వైద్య చికిత్స కోసం, రైలులో మంటలు చెలరేగిన సమయంలో రైలులో చైన్ లాగవచ్చు. రైలులో దోపిడీ జరుగుతుంటే లేదా దొంగతనం జరుగుతుంటే, అలాగే ఏదైనా సహ ప్రయాణికుడు ( ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు లేదా వికలాంగులు) పొరపాటున వేరే స్టేషన్ లో దిగిపోతే చైన్ లాగడంలో తప్పులేదని రూల్స్ చెబుతున్నాయి..
కానీ చాలా మంది రైల్వే రూల్స్ తెలుసుకోకుండా అనవసర కారణాలతో చైన్ లాగుతున్నారు. ఇది చట్టపరంగా నేరం, దీనికి జరిమానా లేదా శిక్ష పడవచ్చు.
అనవసరంగా చైన్ లాగితే శిక్ష
అన్ని రైలు బోగీలలో అత్యవసర చైన్ పుల్లింగ్ సౌకర్యం ఉంటుంది. రైల్వే రూల్స్ ప్రకారం అత్యవసర సమయాలలో కాకుండా, అనవసరంగా చైన్ లాగితే, భారతీయ రైల్వే చట్టం సెక్షన్ 141 ప్రకారం శిక్ష విధిస్తారు. భారతీయ రైల్వే చట్టం సెక్షన్ 141 ప్రకారం అనవసరంగా చైన్ లాగడం నేరం. రైలు ప్రయాణికుడు ఏ కారణం లేకుండా చైన్ లాగితే.. వారికి జైలు శిక్ష పడవచ్చు. రూ. 1000 జరిమానా విధించవచ్చు లేదా కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష సైతం ఎదుర్కోవాల్సి రావచ్చు.
ట్రెయిన్ టికెట్ కన్మాఫ్ కాకున్నా, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు రైలులో ఎక్కి ప్రయాణిస్తే జరిమానా విధించేలా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు ఇకనుంచి స్లీపర్ కోచ్, ఏసీ కోచ్‌లోనూ ప్రయాణించడం వీలుకాదు. స్లీపర్, ఏసీ కోచ్‌లో వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారు ప్రయాణిస్తే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. పూర్తివివరాలకు క్లిక్ చేయండి






















