అన్వేషించండి

Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!

Indian Seafarers Killed Oman:ఒమన్‌లో భారత నౌకలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పలావు జెండా నౌకపై దాడి, ముగ్గురు భారతీయ నావికులు మృతి.
  • ఎంటీ జల్వీస్ నౌక ఇంజిన్‌లో మంటలు; 20 మంది సురక్షితంగా బయటపడ్డారు.
  • భారత ప్రభుత్వం దాడులను ఖండించి, అమెరికాకు తీవ్ర నిరసన తెలిపింది.

Indian Seafarers Killed Oman:నీలి సముద్రం రక్తసిక్తమవుతోంది. పశ్చిమ ఆసియాలో రగులుతున్న ఉద్రిక్తతలు సామాన్య నావికుల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై జరిగిన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో, ఒమన్ తీరంలోని షినాస్‌ పోర్డు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో భారతీయ నావికులు లక్ష్యంగా దాడులు జరిగాయి. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై ఒమన్ గల్ఫ్‌ గుండా వెళ్తుండగా దాడి జరిగింది ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

రెండో దాడి ఎంటీ జల్వీస్ నౌకపై జరిగింది. షినాస్ పోర్టు సమీపంలో ఈ నౌకపై దాడి జరిగింది. దీని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో నౌక సముద్రం మధ్యలో తగలబడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 20 మంది భారతీయులు ఉన్నారు. 

ఈ దాడులు జూన్ 10-11 తేదీల్లో జరిగాయి. బుధవారం జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగింది. గురువారం జరిగిన ఘటనలో నౌక మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల ఫలితంగా భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పార్వర్డ్‌ సీమెన్‌ యూనియన్ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. వారు చెప్పిన వివరాలు పరిశీలిస్తే, ఒక చీఫ్ ఇంజనీర్‌, ఇద్దరు నావికులు ఈ దుర్ఘటనలో మరణించారు. మొత్తం 24 మంది సిబ్బందిలో 21 మందిని సురక్షితంగా రక్షించారు. ముగ్గురు గల్లంతయ్యారు. తర్వాత వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. 

ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేయడానికి అమెరికా చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది జరిగి ఉండవచ్చని, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఎంప్రేర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. దాడి జరిగే పక్షంలో, సిబ్బందిని ఓడ వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉండాలని గతంలోనే హెచ్చరించారు.

మూడు రోజుల్లో మూడు నౌకలపై దాడి 

MT జల్వీర్‌పై దాడికి ముందు, గత రెండు రోజులుగా ఒమన్ తీరప్రాంతంపై దాడులు జరుగుతుండగా, నౌకపై ఇది వరుసగా మూడో దాడి. బుధవారం, సెటెబెలో ట్యాంకర్‌పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరసన తెలియజేయడానికి భారత్, అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించింది. 

భారత్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ  ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్‌ నాయుడు, అమెరికా చార్జ్‌ డి అఫైర్స్‌ జాసన్ మిక్స్‌ను పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.                 

Frequently Asked Questions

భారతీయ నావికులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఎక్కడ జరిగాయి?

ఒమన్ తీరంలోని షినాస్ పోర్ట్ సమీపంలో, హోర్ముజ్ జలసంధి వద్ద భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు జరిగాయి.

ఏ నౌకలపై దాడులు జరిగాయి, అవి ఎప్పుడు సంభవించాయి?

జూన్ 10-11 తేదీలలో పలావు జెండాతో ఉన్న ఎంటీ సెట్టిబెల్లో మరియు ఎంటీ జల్వీస్ అనే రెండు నౌకలపై దాడులు జరిగాయి.

ఈ దాడులలో ఎంతమంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు?

ఈ దాడుల ఫలితంగా ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.

ఈ దాడులపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది?

భారత ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమెరికా చార్జ్ డి అఫైర్స్‌కు నిరసన తెలియజేసింది మరియు ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget