అన్వేషించండి

Petrol Diesel Excise Duty: పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?

Petrol Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ నిర్నయం తీసుకుంది.

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. గురువారం విడుదల చేసిన జీవో ప్రకారం, పెట్రోల్ పై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.10 నుంచి 0కి తగ్గించారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..

కేంద్రం చేసిన పన్నుల తగ్గింపు వల్ల సామాన్య వినియోగదారులకు పెట్రోల్ తక్కువ ధరకు లభించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పంపు విక్రయాలపై ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ తగ్గింపును అవే వినియోగించుకునే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 అమెరికన్ డాలర్లు దాటాయి. దీనివల్ల ప్రస్తుతం ఓఎంసీలు విక్రయించే ప్రతి లీటరు పెట్రోల్ లేదా డీజిల్‌పై రూ. 48.8 నష్టపోతున్నాయి. రష్యా కంపెనీ రోస్నెఫ్ట్, కేసాని ఎంటర్ప్రైజెస్ మద్దతు ఉన్న దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ, పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 5.3, రూ. 3 పెంచిన తరువాత రోజే ప్రభుత్వం ఈ ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకుంది. 

ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించిన కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలమార్గం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ఇంధన సరఫరా మార్గం. 20 నుండి 25 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, దాదాపు 10 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. 

ATF పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం అమలు
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. కొత్త నిబంధనల ప్రకారం, ATF పై లీటరుకు ₹50 పన్ను నిర్ణయించారు. మినహాయింపు తరువాత, ఎఫెక్టివ్ రేటు లీటరుకు 29.5కి తగ్గించారు. ఇది విమానయాన సంస్థల వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది.  

దేశీయ చమురు కంపెనీలకు పెద్ద ఉపశమనం
ప్రభుత్వం పెట్రోల్ పై పన్నును పూర్తిగా తొలగించింది. అయితే డీజిల్ పై లీటరుకు ₹18.5 చొప్పున నిర్ణయించింది. ఎగుమతుల కోసం పెట్రోల్, డీజిల్ , ATF పై అనేక సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనితో పాటు 2022లో అమలులోకి వచ్చిన విండ్‌ఫాల్ టాక్స్ కూడా రద్దు చేశారు. దీనివల్ల దేశీయ చమురు కంపెనీలకు ఉపశమనం లభిస్తుంది. ఈ మార్పులన్నీ అమలులోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం గురువారం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. భారత్ వద్ద సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు, 30 రోజులకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు ఉన్నాయని తెలిపింది. కొరత గురించి వస్తున్న నివేదికలను కొట్టిపారేసింది. ముడి చమురు, ఎల్‌పీజీ దిగుమతులను పెంచడానికి ప్రభుత్వం కొత్త ఒప్పందాలను వేగవంతం చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ వారం పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్ లోని మూడు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలలో ప్రస్తుతం సుమారు 3.372 మిలియన్ టన్నుల చమురు ఉందని, ఇది వాటి గరిష్ట సామర్థ్యంలో మూడింట రెండు వంతులని తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget