Sonia Gandhi meeting: రేపు కాంగ్రెస్ కీలక సమావేశాలు- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై వ్యూహరచన
సోనియా గాంధీ ఆధ్వర్యంలో రేపు కీలక సమావేశం జరగనుంది. పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీతో ఆమె భేటీ కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏం చేద్దాం? ఎలా చేద్దాం..? అనే అంశాలపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కూడా ఉండవు. అయితే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలా వ్యవహరించాలని... పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అదే దానిపై చర్చించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందు కోసం... పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీతో రేపు సమావేశం కానున్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ.
ముంబైలో ఇండియా కూటమి సమావేశాల తర్వాత సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరామె. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని రేపు డిశ్చార్జ్ అవుతారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే... పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు పార్లమెంటరీ స్ట్రాలజీ టీమ్‌తో భేటీ అవుతారు సోనియా. పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై... పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీతో చర్చిస్తారు.
ఇక, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా... ఇండియా కూటమి నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల ఇండియా కూటమిలోని పలు పార్టీలు ఫ్లోర్ లీడర్లను నియమించాయి. వీరితో ఖర్గే సమావేశం కానున్నారు. రేపు రాత్రి 7గంటలకు ఖర్గే ఇంట్లో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ స్ట్రాటజీపై కీలక చర్చలు జరపనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏ విధానం తీసుకోవాలని అనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దీంతో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు... సమావేశాలు ఏర్పాటు చేసి... పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించబోతున్నారు. జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటుపై కూడా వీరి సమావేశాల్లో చర్చకు రానుంది.
ఇండియా నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్... ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలు ముంబై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలని తీర్మానం చేసుకున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నుంచే.. ఎన్డీయేపై కలిసికట్టుగా పోరాడాలని భావిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఐక్యంగా నిలదీయాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
ఇక... బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 10కి పైగా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ పార్గీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు.. బీజేపీ తీరును ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎన్డీఆర్ సర్కార్ నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తోందని విరుచుకుపడుతున్నాయి. ప్రత్యేక సమావేశాలు పిలవాల్సి అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ ఇష్టానుసారం పార్లమెంటు నడుస్తోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.