అన్వేషించండి

Chandrayaan 3 Landing: నాసాను ఫాలో అవుతున్న ఇండియా, భారీగా పెట్టుబడులు

Chandrayaan 3 Landing: మరి కొద్ది గంటల్లో ఇస్రో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన దేశంగా రికార్డులకెక్కనుంది.

Chandrayaan 3 Landing: మరి కొద్ది గంటల్లో ఇస్రో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన దేశంగా రికార్డులకెక్కనుంది. ఇది విజయవంతమైతే భారత్ నూతన అంతరిక్ష పరిశ్రమకు ఆర్థికంగా తక్షణ ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు, అధికారులు భావిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాలు ఇప్పడు వ్యయప్రయాసలతో కూడుకున్నవి అయిపోయాయి. ఒక ప్రయోగం పూర్తి అయితే మరో ప్రయోగానికి నిధులు సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు పెట్టబడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహించారు. వచ్చే పదేళ్లలో ప్రపంచ ప్రయోగ మార్కెట్‌లో తన వాటాను ఐదు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడులకు ఈ రంగాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది. చంద్రయాన్-3 విజయవంతమైతే, భారత అంతరిక్ష రంగం ఖర్చు, పోటీ ఇంజినీరింగ్‌లో పేరు ప్రఖ్యాతులు పొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ మిషన్ కోసం కేవలం $74 మిలియన్ల బడ్జెట్‌ను ఖర్చు చేసింది. ఇతర దేశాలకంటే తక్కువ ఖర్చుతో భారత్ ప్రయోగాలు చేస్తోంది. 

రెండు వారాల కిందట ప్రయోగించబడిన రష్యాకు చెందిన లూనా-25 చంద్రుడిపైకి చేరడంలో విఫలమైంది. కక్ష్య నుంచి చంద్రుడిపై ల్యాండర్ ల్యాండ్ అవుతూ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగానికి రష్యా భారీగా నిధులు ఖర్చు చేసింది. మిషన్ ఫెయిలైన నేపథ్యంలో మరో సక్సెసర్ మిషన్ కోసం రష్యా నిధులను కేటాయించడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. 

ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ దేశం లునా ప్రయోగం చేయగలిగింది. ఈ మిషన్‌కు ఎంత ఖర్చు చేశారో రష్యా వెల్లడించలేదు. లూనా కొనసాగింపు ప్రయోగానికి నిధులు సమకూర్చే సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్కోకు చెందిన స్వతంత్ర అంతరిక్ష నిపుణుడు, రచయిత వాడిమ్ లుకాషెవిచ్ మాట్లాడుతూ.. అంతరిక్ష అన్వేషణ ఖర్చులు సంవత్సరానికి క్రమపద్ధతిలో తగ్గుతాయని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా లూనా-25 ప్రయోగం పునరావృతం కావడం అంత సులువుకాదన్నారు. 

ఇండియా, రష్యాలు ప్రయోగాలు 1960 లలో యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ దేశాల అంతరిక్ష పోటీని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు అంతరిక్షం ఒక వ్యాపారం అయింది. చంద్రుని దక్షిణ ధృవంపై నీటి మంచు వరంగా మారనుంది. భవిష్యత్తులో చంద్ర కాలనీ ఏర్పడడానికి, మైనింగ్ కార్యకలాపాలు, అంగారక  మిషన్‌లకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. 

2025 నాటికి NASA ఆర్టెమిస్ మూన్ ప్రోగ్రామ్‌లో సుమారు $93 బిలియన్లు ఖర్చు చేసే ఆలోచనలో ఉన్నట్లు US స్పేస్ ఏజెన్సీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అంచనా వేశారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం అయితే, తర దేశాలు ఇండియాతో అసోసియేట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని న్యూ ఢిల్లీలోని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసెస్ కన్సల్టెంట్ అజే లేలే అన్నారు. చంద్రయాన్‌ లాంటి మిషన్లను ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని, ఇస్రో సామర్థ్యం ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ప్రపంచంలో ఇస్రో ఇప్పుడు ఒంటరి కాదన్నారు. 
 
చైనా 2019లో చంద్రునిపై మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. తరువాత మరిన్ని మిషన్లను ప్లాన్ చేసింది. అంతరిక్ష పరిశోధన సంస్థ యూరోకాన్సల్ట్ అంచనా ప్రకారం 2022లో చైనా తన అంతరిక్ష కార్యక్రమంలో $12 బిలియన్లు ఖర్చు చేసింది. అంతరిక్షంలో నాసా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిందని, ఇండియా దానిని ఫాలో అవుతోందని అక్కడి అధికారులు తెలిపారు. 

ఉదాహరణకు, ఎలోన్ మస్క్  స్పేస్‌ఎక్స్, దాని ఉపగ్రహ ప్రయోగ వ్యాపారం కోసం స్టార్‌షిప్ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది, అలాగే NASA వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళ్లడానికి $3-బిలియన్లతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి మించి, స్పేస్‌ఎక్స్ ఈ సంవత్సరం స్టార్‌షిప్‌పై సుమారు $2 బిలియన్లను ఖర్చు చేస్తుందని మస్క్ చెప్పారు. 

USకు చెందిన అంతరిక్ష సంస్థలు ఆస్ట్రోబోటిక్, ఇంట్యూటివ్ మెషీన్‌లు చంద్రుని ల్యాండర్‌లను నిర్మిస్తున్నాయి. ఇవి ఈ సంవత్సరం చివరి నాటికి లేదా 2024లో చంద్రుని దక్షిణ ధృవంపైకి ప్రయోగించే అవకాశం ఉంది. అలాగే ఆక్సియం స్పేస్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రైవేట్‌గా నిధులు సమకూర్చుతున్నాయి. సోమవారం, సౌదీ, దక్షిణ కొరియా పెట్టుబడిదారుల నుంచి 350 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు ఆక్షియం తెలిపింది. 

అంతరిక్షం ప్రమాదకరంగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019లో ల్యాండ్ చేయడానికి భారతదేశం చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే సంవత్సరం ఇజ్రాయెలీ స్టార్టప్ మొదటిసారిగా ప్రైవేట్‌గా నిధులు సమకూర్చిన మూన్ ల్యాండింగ్‌లో విఫలమైంది. జపనీస్ స్టార్టప్ ఐస్పేస్ ఈ సంవత్సరం ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైంది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ బెథానీ ఎహ్ల్మాన్ మాట్లాడుతూ.. మనం చూస్తున్నట్లుగా చంద్రునిపై ల్యాండింగ్ కష్టం అన్నారు. చంద్ర దక్షిణ ధ్రువం, దాని నీటి మంచును గుర్తించడానికి 2024 మిషన్‌లో నాసాతో కలిసి పనిచేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget