![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై భారత్ స్పందించింది. ఉగ్రవాదంపై పోరుకు తమ వంతు పాత్ర పోషిస్తామని, అఫ్గాన్‌కు మద్దతు ఉంటుందని విదేశాంగశాఖ పేర్కొంది.
![Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా India strongly condemns the terrorist attack on a Shia mosque in Kunduz of Afghanistan: Ministry of External Affairs Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/27/eef3a3fcb1b3bab133997dcd16166ebe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్ నార్త్ ప్రావిన్స్ కుందుజ్ లో షియా ముస్లింల మసీదుపై జరిగిన దాడిలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ కష్ట సమయంలో అఫ్గాన్‌కు భారత్ మద్దతుగా నిలిచింది. ఉగ్రవాదం, ఉగ్రవాదులపై భారత్ పోరాటం కొనసాగుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది. అఫ్గాన్‌లో ఉగ్రవాదం నిర్మూలనకు తమ వంతు పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read: 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది ఎప్పుడో తెలుసా!
India strongly condemns the terrorist attack on a Shia mosque in Kunduz, Afghanistan in which more than 100 Afghans were reported to have lost lives & several others injured: Ministry of External Affairs pic.twitter.com/orIkRBrDwZ
— ANI (@ANI) October 11, 2021
షియా ముస్లింలపై ఉగ్రదాడులు..
మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నార్త్ ప్రావిన్స్‌లో గత శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. అఫ్గాన్‌లోని నార్త్ కుందుజ్ ప్రావిన్స్‌లో షీతె ముస్లింలను, మసీదు లక్ష్యంగా దాడి జరిగినట్లు సమాచారం. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు గతంలోనూ దాడులకు పాల్పడ్డారు.
Also Read: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి.. భయానక పరిస్థితులు!
ఈ ఏడాది ఆగస్టు చివర్లో అమెరికా మరియు నాటో సంయుక్త బలగాలు ఆఫ్ఘనిస్థాన్ ను వీడిన తరువాత జరిగిన అతి పెద్ద మిలిటెంట్ దాడి ఇది అని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం గోజర్ ఈ సయీద్ అబాద్ మసీదులో ప్రజలు అధికంగా ఉంటారని భావించి ఉగ్రదాడికి పాల్పడినట్లు అధికార ప్రతినిథి తెలిపారు. చూస్తుండగానే భారీ సమూహంలో బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షి అలీ రెజా తెలిపాడు. మొదట 100 మందికి పైగా చనిపోయారని కథనాలు రాగా, 50 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)