India Covid Cases: దేశంలో కొత్తగా 33,376 మందికి కోవిడ్.. కేరళలోనే 25 వేల కేసులు..
గడిచిన 24 గంటల్లో దేశంలో 15.92 లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 33,376 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
![India Covid Cases: దేశంలో కొత్తగా 33,376 మందికి కోవిడ్.. కేరళలోనే 25 వేల కేసులు.. India records 33,376 new Covid-19 cases, 308 deaths in 24 hours India Covid Cases: దేశంలో కొత్తగా 33,376 మందికి కోవిడ్.. కేరళలోనే 25 వేల కేసులు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/04/9097896a6e6d66a7447ee57071203130_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా దేశంలో నమోదవుతోన్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 15.92 లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 33,376 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3.32 కోట్లకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 32,198 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 308 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,42,317కి చేరింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 97.49 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ తన బులెటిన్ లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,91,516 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కేరళలో గడిచిన 24 గంటల్లో 25 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
India reports 33,376 new #COVID19 cases, 32,198 recoveries and 308 deaths in last 24 hours, as per Health Ministry.
— ANI (@ANI) September 11, 2021
Total cases: 3,32,08,330
Active cases: 3,91,516
Total recoveries: 3,23,74,497
Death toll: 4,42,317
Total vaccination: 73,05,89,688 (65,27,175 in last 24 hours) pic.twitter.com/ESmk1Q9BMN
నిన్న ఒక్క రోజే 65,27,175 మందికి వ్యాక్సిన్..
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 65.27 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73,05,89,688 కోవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54,01,96,989 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/0EBF9drB69
— ICMR (@ICMRDELHI) September 11, 2021
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)