Corona Cases: దేశంలో కొత్తగా 20 వేల కరోనా కేసులు- 36 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 20,279 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 36 మంది మృతి చెందారు. తాజాగా కొవిడ్ నుంచి 18,143 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.45 శాతానికి చేరింది.
India records 20,279 new COVID19 cases today; Active caseload at 1,52,200 pic.twitter.com/ZPqVO3luQD
— ANI (@ANI) July 24, 2022
- మొత్తం కేసులు: 4,38,88,775
- మొత్తం మరణాలు: 5,26,033
- యాక్టివ్ కేసులు: 1,52,200
- మొత్తం రికవరీలు: 4,32,10,522
వ్యాక్సినేషన్
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 24, 2022
➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 201.99 Cr (2,01,99,33,453).
➡️ Over 3.85 Cr 1st dose vaccines administered for age group 12-14 years.https://t.co/9QgPIuNuKD pic.twitter.com/t1j70WgmMf
దేశంలో కొత్తగా 28,83,489 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.99 కోట్లు దాటింది. మరో 3,83,657 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Delhi High Court: రేప్ చేసి పెళ్లి చేసుకుంటే పాపం కడిగేసుకున్నట్టేనా? ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు