Husband Wife Relation: ఇష్టంగానే భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ల ఫ్యామిలీల జోక్యం చెల్లదు, హైకోర్టు కీలక తీర్పు
Delhi HC Verdict: రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందున ఆ జంటకు భద్రతను కల్పించాలని ధర్మాసనం ఢిల్లీ పోలీసులను శనివారం (జూలై 24) ఆదేశించింది.
Delhi High Court News: ఇద్దరు పెద్దవారు భార్యాభర్తలుగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందున ఆ జంటకు భద్రతను కల్పించాలని ధర్మాసనం ఢిల్లీ పోలీసులను శనివారం (జూలై 24) ఆదేశించింది. కులం, సమాజంతో సంబంధం లేకుండా పెళ్లి జరిగినప్పుడు.. ప్రత్యేకించి తమ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని కోర్టు నిర్దేశించింది.
దేశంలోని పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడటం రాష్ట్ర కర్తవ్యం మాత్రమే కాదని.. యంత్రాంగం, ఏజెన్సీల బాధ్యత కూడా అని జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. తమకు పోలీసుల రక్షణ కోరుతూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందే తాము వివాహం చేసుకున్నామని బాధితురాలు కోర్టుకు తెలిపారు. మహిళ తండ్రి ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలడని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి చెప్పారు.
పౌరులకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యతపై రాష్ట్రం నడుస్తుందని కోర్టు పేర్కొంది. ప్రత్యేకించి అంగీకారంతో వివాహం చేసుకున్న పెద్దలు వేరే కులానికి లేదా వర్గానికి చెందిన వారైతే రక్షణ మరింత ముఖ్యమైనది. పౌరుల రక్షణ కోసం ఆదేశాలు జారీ చేసే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ప్రస్తుతం వివాదంలో ఉన్న విషయాల్లో. ఇద్దరు పెద్దలు భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అంగీకరించిన తర్వాత వారి కుటుంబంతో సహా మూడవ పక్షాల నుండి వారి జీవితాల్లో ఎటువంటి జోక్యం ఉండదు. మన రాజ్యాంగం కూడా దీన్ని నిర్ధారిస్తుందని పేర్కొంది
పోలీసులకు ఆదేశాలు
ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితికి సంబంధించి పిటిషనర్ల నుండి ఏదైనా కాల్ వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని పోలీసు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ముంతాజ్ అహ్మద్, సతీష్ శర్మ వాదనలు వినిపించారు. రాష్ట్రం తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముఖేష్ కుమార్‌తో పాటు అదనపు స్టాండింగ్ కౌన్సెల్ (క్రిమినల్) కమ్నా వోహ్రా వాదనలు వినిపించారు.