అన్వేషించండి

Operation Sindoor: పాకిస్థాన్‌కు భారత్‌ స్వీట్WARning - డ్రోన్‌లతోనే పలు నగరాలపై దాడులు

Operation Sindoor: సైనిక స్థావరాలను పాక్‌ లక్ష్యంగా చేసుకోవడంతో భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. దాయాది దేశం మిసైల్స్ ప్రయోగించి విఫలమైతే... ఇండియన్ ఆర్మీ డ్రోన్‌లతో ధ్వంస రచన చేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో గింగిరాలు తిరుగుతున్న పాకిస్థాన్‌ భారత్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ వాళ్లకు పరాభవం తప్పలేదు. జలంధర్, జమ్మూ, బటిండా, అవంతిపుర, శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల వంటి 15 నగరాల్లోని సైనిక స్థావరాలను దాడికి యత్నించి విఫలమైంది. భారతదేశ శక్తిని తట్టుకోలేకోపోయింది. 

భారత్ సైనిక స్థావరాలను టచ్ చేయాలనే ఆలోచన వచ్చిందుకు పాకిస్థాన్‌కు గట్టిగానే ఇండియన్ ఆర్మీ బదులిస్తోంది. పాకిస్థాన్‌ మిసైల్స్‌ బోర్డర్ దాటకుండానే భారత్ ఆర్మీ పేల్చేసింది. అంతే కాదు మన దేశానికి చెందిన ఆర్మీ డ్రోన్స్‌ వెళ్లి పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టించాయి. తమ రక్షణ కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ HQ9 యూనిట్లను భారత్ నిర్వీర్యం చేసింది. అంతే కాదు పాకిస్తాన్‌లోని పలు నగరాల్లోని సైని స్థావరాలపై దాడులు చేసింది. 

HQ-9 వాయు రక్షణ వ్యవస్థ నాశనం పాకిస్తాన్‌కు చాలా పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఈ దాడి రీసౌండ్‌ బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు వినిపిస్తోంది. పాకిస్తాన్‌ సైన్యం HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లు డ్రోన్ దాడుల్లో తుక్కు తుక్కు అయ్యాయి. లాహోర్, సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా, రావల్పిండి, చక్వాల్, బహవల్పూర్, మియాన్‌వాలి, కరాచీ, చోర్, మియానో, అటోక్‌లలో భారత్ ఆర్మీ డ్రోన్‌లు చొచ్చుకు వెళ్లి విధ్వంసం సృష్టించాయి. కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి.  

రావల్పిండిలో ఉన్న క్రికెట్ స్టేడియంపై కూడా భారత్ డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఆటగాళ్లను పాకిస్థాన్ తరలించింది. మరోవైపు పాకిస్థాన్‌లో ఉన్న అమెరికా టూరిస్టులు బహిరంగ ప్రదేశాల్లో తిరుగొద్దని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.  

పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకోవడం లేదని మొదటి నుంచి భారత్ చెబుతోంది. తమ దేశంలో విధ్వంసానికి కారణమైన ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశామని కూడా ప్రపంచానికి తెలియజేసింది. తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించని పాకిస్థాన్‌ ఇలా దాడులు చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ ఇప్పుడు ఏకంగా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంది. ఇదే విషయంపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ మాట్లాడుతూ...  పాకిస్తాన్‌తో జగడం తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారత్‌కు లేదు, కానీ సైనిక దాడులు జరిగితే, దానికి "చాలా" గట్టిగా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అనాగరికమైన" పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా బుధవారం సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి అన్నారు.

"ఈ దాడి మే 7న సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా ప్రతిస్పందించవలసి వచ్చింది. మా ప్రతిస్పందన చాలా టార్గెటెడ్‌గా జరిగిందని " అని ఆయన అన్నారు.

"పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడం మా ఉద్దేశ్యం కాదు. అయితే, మాపై సైనిక దాడులు జరిగితే, దానికి చాలా దృఢమైన ప్రతిస్పందన ఎదురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు" అని ఆయన అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget