అన్వేషించండి

భారత్, కెనడా మధ్య చల్లారని వివాదం, ట్రూడోకు మద్దతు పలికిన బైడెన్, రిషి సునాక్

భారత్‌, కెనడా మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి.

భారత్‌, కెనడా మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత్‌లోని దౌత్య సిబ్బందిలో 41 మందితో పాటు వారి కుటుంబ సభ్యులతో సహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా ప్రకటించింది. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్‌ హెచ్చరించింది. దీంతో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు కెనడా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య అన్న కెనడా వ్యాఖ్యానించింది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది. 

దౌత్యపరమైన రక్షణ కల్పించాలి
భారత్‌ హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా ప్రకటించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యుకే అధ్యక్షుడు రిషి సునాక్ స్పందించారు. వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై ఢిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని బైడెన్ స్పష్టం చేశారు. భారత్‌లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఢిల్లీ డిమాండ్‌ చేయడం, దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు మంచింది కాదన్నారు. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరమన్న బైడెన్, దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కెనడాపై భారత్‌ ఒత్తిడి చేయవద్దని సూచించారు. కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరారు. 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద దౌత్య సంబంధాలకు భారత్‌ కట్టుబడి ఉండాలన్నారు. కెనడా దౌత్య మిషన్‌లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ కల్పించాలని బైడెన్ సూచించారు. 

ఏకపక్షంగా ఎత్తివేయడం సరైంది కాదు
భారత్‌ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా భారత్ నిర్ణయించడాన్ని రిషి సునాక్ తప్పుపట్టారు. దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణకు ఏకపక్షంగా ఎత్తివేయడం, వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. కెనడా దౌత్యవేత్తలపై భారత్‌ అనుసరించిన వైఖరి రెండు దేశాల్లోని లక్షల మంది జీవితాలను దుర్భరం చేస్తుందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. దౌత్యం ప్రాథమిక సూత్రానికి భిన్నంగా భారత్‌ వ్యవహరిస్తోందని ట్రూడో మండిపడ్డారు. 

భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ఇది భారత్ కు ఆగ్రహం తెప్పింది. అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టటం చేసింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget